ద్వి తీ యా శ్వా స ము
149
దిరుగదా యుండనిమ్ము' సాధింపరాని
పనికి వగవేల యాయాస పడఁగనేల? 276
శా॥ ఆకాపట్యము లాదరస్మితము లాయౌదార్య మావియ్య మా
మోకాల్ మ్రొక్కులు నాచమూవిభవ మా ముప్రొద్దు సేవించుటల్
నాకెత్తున్ దలనొప్పి పట్టణము లన్నన్ ; మీకు నెట్లుండునో
నాకీ కొండలువోలె సౌఖ్యమిడు శాంతస్థానముల్ లేవుపో 277
శా॥ ఈసర్వంసహయెల్ల లోఁబడకపోయెన్ నాకటం చెప్పుడున్
గాసిన్ బొందఁ బొగడ్తపై మదినిడన్; గష్టంబు లెక్కింపఁ బే
రాసన్ ద్రవ్యముఁగోర; నిట్టి తృణశయ్యల్ పర్ణశాలల్ సుధ
ర్మా సింహాసన వైజయంతముల మేరన్ జూచి యుప్పొంగెదన్.278
గీ॥ అనుచుఁ దనమాట మోయనీయమినిఁ జేసి
మోమొకింత వివర్ణతఁ బొందుచుండ
నెట్లొ సవరించుకొని ప్రతాపేంద్రుఁ జూచి
మానసింహుఁడు కార్యంబు మఱువలేక. 279
సీ॥ "క్రొత్తఁగా నేఁజెప్పుకొనఁగ నేమిటికి నీ
యెఱుఁగని ధర్మంబు లెందులేపు
మేవాడరాజ్య లక్ష్మీదేవి దెస నొక్క
కనువైచియుండు నక్చరు నృపాలుఁ
డెప్పుడు రేఁగునో యేదెస వచ్చునో
యెట్లుచేయునో యెవ్వరెఱుఁగఁ గలరు
పట్టుపట్టెనయేని వానిచలంబును
బౌరుష మింతని పలుకవశమె
గీ॥ లేడిపయి దూఁకు సింగంఖు జాడవచ్చు
నెంత విక్రమోన్నతియున్న నేమిఫలము
వానిపౌరుష ధాటి కోర్వంగ లేక
బాధపడెదవు; బలవద్విరోధమేల" 280
చ॥ పెరసృపులెల్ల లోఁబడెడు వేళలఁ గొన్ని నిబంధనంబు ల
క్బరు విధియించుచుండుట జగం బెఱుఁగున్ గద యైననిన్ను నా