148
రా ణా ప్ర తా ప సిం హ చ రి త్ర
బును ధర్మాచరణంబు సత్యము యశంబున్ ద్యాగము గల్గు ని
య్యనఘ స్వాంతుల సంఖ్యఁబట్టి యెపుడా యౌన్నత్య మేపారెడున్ 273
క॥ తనతల్లియుఁ దనదేశము
తనకా స్వర్గమ్ముకన్నఁ దతలక్ష్మీ వ
ర్ధనములు పూజ్యతమంబులు
ననునిది సత్యమును సహజమై పొలుపొందున్.274
సీ॥ అచలవృత్తి వహింతు నాధర్మమూని; లో
కము పుట్టుటాది యీక్షణము దాఁక
మాదానువంశంబు మానవమాత్రుని
కెవనికిఁ దలయొగ్గి యెఱుఁగదెప్పు
డస్వతంత్రము మేరు వైనలక్ష్యముచేయ
స్వేచ్ఛ జీవింప నూహింతుఁగాని
యక్బరు తన రాజ్య మంత యిచ్చెదనన్న
నదియేల! క్రీఁగంట నైనఁజూడ
గీ॥ వల్కలముఁ గట్టి స్వాతంత్య్ర వైభవమున
నిట్లు సన్న్యాసినై యున్న నిదియే చాలు
నాకు భోగభాగ్యముల కెంతయును దూర
మాస విడిచిన వాని కాయాసమున్నె! 275 275
సీ॥ అఖిల భోగములున్న నాత్మతృప్తియులేక
దారిద్య్ర జలధి నాతఁడు మునుంగు
నేసంపదయు లేకయే స్వతంత్రత నుండి
యీశ్వరుకృప గడియింపనేర్తు
గౌరవమునకు భంగముఁ దెచ్చు నక్బరు
తో సంధి నాకు సంతోష మిడదు
మేమిర్వురము దూరమై మనుటయే శ్రేయ
మిది దైవసంకల్ప మింతమాత్ర
గీ॥ భారతావని కెట్టి లోపమును రాదు
కాలచక్రము తిరిగేనా కలిమి తిరుగుఁ