144
రా ణా ప్ర తా ప సిం హ చ రి త్ర
వైరము మేలుగా; దెపుడుఁ బాలును నీరునుబోలె నొక్కఁడై
మీరు మెలంగినన్ జగము మేలుగనున్ సుఖ మగ్గలంబగున్. 259
మ॥ గురువైరాగ్య మహాసముద్రుఁడవు నీకున్ బూర్జ సౌభాగ్య భా
గ్యరమాసేవధి యక్బరీశ్వరునకున్ గల్లోల గంభీర సు
స్థిర పాధోధులఁగూర్చు చిన్న జలసంధిన్ బోలె నే సంధిన్
వఱలన్ జేసెద! శంభుమాధవుల రేవన్ మైత్రి వర్తింపరే 260
క॥ సిరులఁ దులఁదూగ వలసిన
ధరణిని యుద్ధములులేపి దారుణ వధలన్
జరిపించి రక్తబలులను
నెఱపఁ దలఁపఁ బోకుమనుచు విన్నర్ధింతున్. 261
క॥ అన మోము మందహాసము
చినుకఁ బ్రతాపుఁడును మానసింహం వదనమున్
గని నీవచించు హితముల
కును నామది నెంతయేనిఁ గుతుకంబయ్యెన్. 262
సీ॥ సచరాచర ప్రపంచము పుట్టుటాది యా
త్మస్వేచ్ఛ ప్రధమ బాధ్యత నరునకు
నొక మానవుండు వేరొకనికి లోఁబడి
మనుటయు దైవ సమ్మతముగాదు
ధనరాజ్య విభవ సాధనము లొసగజూపు
వారు వానికి నాస పడెడువారు
సమముగాఁ గలుష భాజను! లైహికాముష్మి
కనుఖముల్ వారికిఁ గలుగఁబోవు
గీ॥ స్వేచ్ఛ మదినెంచి స్వజనంబు నెల్లసిరులు
ప్రాణమును సర్వమునుబాయు వారియెడల
దైవమే లేకయున్న నీధరణియందు
సత్యమేలేదు! పైన నీశ్వరుఁడె లేఁడు. 263
సీ॥ రాజనీతియును ధర్మం బీద్వయిని నీతి
తఱచుగా లాభప్రదముగ్య దోఁచుఁ