పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/94

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విజయవిలాసము

45


క. కాకోల ఘనాఘనఘన
   కాకోల ఘనాఘనౌఘ కలహంస శిఖి
   శ్రీకంఠ కంఠ భానిభ
   ఘూకప్రితనుతమ మలఘు దిశలఁ బర్వెన్. 63

స్వరూపోత్ప్రేక్ష



సీ. ఇనుఁడు గన్పడ నిసుళ్వెఱిఁగి మందేహులు
             కొంచక నిల నల్లుకొని రనంగ
    సకలంబు నాక్రమించుక నొక్క రూపమై
             పరఁగిన మాయాప్రపంచ మనఁగ
    జారవాంఛిత మహీ జాతముల్ శోభిల్లఁ
             బ్రాపించు దోహద ధూప మనఁగ
    విరహులపై దాడి వెడల వేయించిన
             మారుని నీలగుడార మనఁగఁ

గీ. గటికి చీఁకటి పుడమి యాకసము జత యొ
    నర్చి కాటుకబరిణచందమునఁ జేసి
    చెలఁగు నభిసారికల దీవనలనఁ బెరిగి
    సూదిమొన కెడమీక హెచ్చునను నెరసె. 64

తే. రాజు చనుదెంచు నని నిశారమణి యప్పు
    డింద్రనీలఁపు మణిపాత్ర లిడిన సోబ
    నంపుటారతి తెలిముత్తియంపు గుంపు
    లనఁగ నభమునఁ దారక లతిశయిల్లె. 65

అపూర్వప్రయోగము - స్వరూపోత్ప్రేక్ష



సీ. నిక్కుతమశ్శాఖి నెగసి యంతట నుండి
             పొడచూపు మిడుగురు పురువులనఁగఁ
    గాల కృష్ణ మృగాంక కలితమై గనుపించు
             బెడిదంపు తెలిచాయ పొడ లనంగ