పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/93

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

44

ప్రబంధరాజవేంకటేశ్వర


గీ. యొరలి తూటలు కసిగాట్ల కొఱికి నిలుచు
    నిలిచి పెనఁగొన్న నాచుతీఁగలను డాఁగు
    డాఁగి విరహభరమ్మునఁ గాఁగి కుందు
    కుంది యబ్బుర మొందెను గోక మొకటి. 59

సీ. అఖిల ప్రపంచ మహాభూత మోహిని
                మునిజనానుష్ఠాన ముఖ్యవేళ
     స్వైరిణీ పుణ్య సాక్షాత్కార దైవంబు
               చోరావళీభావి శోభనంబు
     కలితనిశీథినీ కాళికా జనయిత్రి
               కమలా మయావహక్షతజ పూర్తి
     మందేహ గృహ కుంకుమ స్ఖానకసమృద్ధి
               యస్తా గదావాలనాభివృద్ధి

గీ. ఘనపలాశ కుసుంభ కోకనద బాల
     కిసలబంధూక హల్లక విసర గైరి
     క చపలాదాడిమీ సుమకాంతి యనఁగ
     గగనతలమున సాంధ్యరాగంబు దనరె. 60

యతిభేదకందము



క. వలసినమేవులు గొని కా
    ళ్ళు లావులును నిక్కులించి దుక్కెగరిపయిన్
    బులుగులు చట్టుపలార్చుచుఁ
    గొలకొలమని కూఁత లిడుచు గూడులు సేరెన్. 61

ఉత్ప్రేక్షాలంకారము



క. అరబాలు సంజకెంపున
    నిరవై దనరారి కడమయిరులను సాబాల్
    కరిబరగుచుఁ జద లత్తఱి
    గరిగల గురువిందగింజకైవడిఁ దనరెన్. 62