పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/72

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విజయవిలాసము

23

తే. పుష్కరస్ఫూర్తిఁ జెన్నొంది భూరిదాన
    పటిమచే మించి వైరిప్రభంజన ప్ర
    శక్తిఁగని నీలరుచిఁ బొల్చి సరసగతుల
    ఘనములన మీఱు నప్పురి గజచయంబు. 13

తే. అమరలక్షణములను ఛందముల మీఱి
    యతులగతులను బదచమత్కృతిఁ జెలంగి
    కందముల మించి సత్కవికావ్యసరణిఁ
    బొలుచు నుత్తమహయము లప్పురమునందు. 14

చ. చిలుకపఠాణియు న్జెఱుకుసింగిణియు న్విరియంపకోలలున్
    దొలఁగఁగఁజేసి తత్పురము తోయజగంధులతో విహారము
    ల్సలుపఁగ వేడ్కతోడ బలుజాడల రూపులు దాల్చినట్టి పూ
    విలుతునిమూర్తులో యనఁగ వీటవిటుల్ జరియింతు రెప్పుడున్. 15

రూపకాలంకారము


చ. అలకలె జాలసూత్రములు హారసమంచిత రత్నరాజి య
    వ్వలయము పూస లాత్మచెలువంబగు పుట్టికగాఁగఁ గామినీ
    కులమును ధీవరవ్రజము కూరిమిచేష్టల మేఁత చేతఁ జూ
    పులవలఁ జిక్కఁజేయు విటపుంగవ మత్స్యములన్ బురాంబుధిన్. 16

అపూర్వప్రయోగము


చ. అలుగువహిన్ వెలార్చి పొగ రందము మీఱుచు స్నేహమానుప
    ట్టుల నొర పైదలిర్చి యుదుటున్ గనుచున్ నసమాస్త్రుకేళిలోఁ
    బలుమొనలాని మాఱ్మగల పగ్గెలు తగ్గులు జేసి ప్రోలునన్
    గలసి చరింతు రవ్విలువకత్తెలు మారునికత్తులో యనన్. 17

రసప్రాధాన్యరూపద్విరుక్తిసీసము


సీ. మిలమిల బెళుకుచూపులు పేరెములు బాఱ
             గలగల గజ్జెలు గులుకరింప
   ఝణఝణహస్తకంకణములు మ్రోయంగ
             గణగణ మొలనూలు గంట లువి యఁ