పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



శ్రీప్రబంధరాజ వేంకటేశ్వర

విజయ విలాసము

ఏకాశ్వాసము

వేంకటాచలపట్టణవర్ణనము

అనుప్రాసయుక్త అక్కిలివడిసీసము

సీ. సింధుర చితపాన బంధురాభ్రవితాన
             సింధురకటదాన గంధలీన
    మారవ పవమాన సారవజ్జవమాన
             గౌరవ హయమాన సారమాన
    మసమాన శరమాన లసమాన తేజోన
             లసమాన ధరణీనరసనిధాన
    మమరనాధవిమాన సమరజయనిధాన
             సమరథాత్యుద్ధాన కమనయాన

తే. మమితగోస్పర్ధి ఘనగోపురాగ్రభాగ
    నిరత రమణీయ హీరమణీకదంబ
    విశదకాతివినిర్మితదశదిశాంత
    ఘట్టనము వేంకటాచలపట్టణంబు. 1

ముద్రాలంకారయుక్తవింశత్యుత్తరశతవృత్తగోపనోదాత్తవచనము

వ. మఱియు నప్పురవరంబు మందాక్రాంత ఫలసదన వనమంజరీమందార సరసిజోత్పలమాలికా సుగంధసుందరీ కనకలతామణి భూషణప్రభాకలితంబై, రుచిరప్రభాత భాస్కర విలసిత మణిదీపికా మణివితానకాంతి చామర పుష్పదామ చంద్రకళవంశస్థాన మణిమాలికా సుందరంబై, భూతిలక వసంతతిలక కుసుమితలతావేల్లిత మనోహర వాతోర్మినదీ ప్రఘోష