Jump to content

పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

18

ప్రబంధరాజవేంకటేశ్వర

యిరువదాఱుఛందంబులకుఁ జందంబును, కావ్యాలంకారచూడామణికిఁ గావ్యాలంకారసంగ్రహమ్మును, సకలాలంకారమ్ముల కలంకారమ్మును, లక్షణసారసంగ్రహ సరస్వతీవిలాస సాహిత్యచింతామణి సత్కవిజనసంజీవని భీమానంత ఛందోముఖ్యాష్టాదశ లక్షణంబులకు లక్ష్యమును, రేఫఱకారనిర్ణయమ్మును, అమరామరశేష విశ్వశాశ్వతశబ్దార్ణవ యాదవ వైజయంతికాకార నానార్థరత్నమాలికాకార హలాయుధ వాగురి కేశవ తారపాల ధరణి ధన్వంతరి ధనంజయ రభస విశ్వప్రకాశ మాధవ చింతామణి జయప్రతాప శుభాంగజయపాల క్షీరస్వామి ప్రణీత చతుర్వింశతివివిధనిఘంటుపదమ్ములకుఁ బదమ్మును, షష్ఠివిధయతిచమత్కారముల కాధారమును, చతుర్వింశతిప్రాసమ్ముల కావాసమ్మును, ప్రౌఢికిఁ బ్రౌఢియును, తేఁటకుఁ దేఁటయును, చిరంతనాంధ్రప్రబంధజాలంబుల కాలవాలంబును, సనాతనవిద్వత్కవి వితాన రచనావిధంబునకు ఘంటాపథంబును, ఇదానీంతన సత్కవినికాయంబునకు సహాయంబును, భవితవ్యకవికలాపంబునకు నాచార్యరూపంబును, నిఖిలభాషావిశేషంబులకు న్మేషణంబును, మూఢజాతులకు బోధహేతువును, ప్రౌఢతతికి సమ్మతియును, సర్వజనకరంబున కాశ్చర్యకరంబును, బహువిధాచుంబితకవితాచమత్కృతికి వసతియును, నగరార్ణవశైలర్తు చంద్రసూర్యోదయోద్యాన సలిలకేళీ మధుపాన సురతి వియోగ *వివాహ కుమారోదయ మంత్ర*ద్యూతప్రయాణ రణనాయకాభ్యుదయ వర్ణనాతిశయంబున కాశయంబును, అన్యానధీన సుధీనవనవస్తవ్య సర్వపధీన పాండితీమండితచమత్కారంబుగా నా రచియింపబూనిన రసికజనహృదయోల్లాసంబైన ప్రబంధరాజవిజయవేంకటేశ్వరవిలాసంబునకుఁ గథాగ్రమంబెట్టిదనిన.