పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/66

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


________________

విజయవిలాసము 58. క స్నేగ్ధాత్మకత్వవిరహిత దోగ్థ్రాశరహరణచండదోశ్చక్రునకున్ వాగ్ధ్రావావక్రున కమ నాగ్ధ్రావలి స్వపదభక్తి నతచక్రునకున్. 59. క ఘృణినిన్ ఘృణిజితఘృణికిన్ ఘృణికి న్సతానువృత్తి హితఫణిగుణికిన్ గుణికిన్ దురగవిమణికిన్ మణికిన్ నిత్యసకలనిగమమనిఫణిఫణికిన్. 60. క భార్ఙోపమానకంధర శార్ఙామర్దననిరూఢ సారభుజబలో పార్జాస్రవప్రభువునకున్ శార్ఙిస్థల్యధికశేషశైలవిభునకున్. 61. క దక్షాహితరక్షాయత వీక్షాయతిభువనభరణవిభవున కసురా ద్యక్షోధరవక్షోవర శిక్షాకరభయదచక్రశీలభవునకున్. 62. క లంకానాయకలలనా లంకారాపహజయాక లంకరతికమీ నాంకసహస్రాకృతికిన్ వేంకటపతికిన్ గటాక్షవిభవోన్నతికిన్. వక్ష్యమాణలక్ష్యవిశేషోద్దేశవచనము 63. వ అంకితంబుగాఁ బంకజాసనవిలాసినీకరాంచలమణివిపంచికాఘుమఘుమార్భటినిర్భరసుధాప్రాదుర్భావాస్పదనవరసగర్భసందర్భంబు గుభాళింప విభవంబులకుఁ బ్రభవంబును, విద్యాధికులకు హృద్యంబును, విన్నాణంబులకుఁ జెన్నును, వింతలకుఁ బొంతనంబును, విటవిటీజనంబులకుఁ బుటపుటయును, విరహులకు మెఱమెఱయును, వీటికి నీటును, శబ్దశాస్త్రరీతికి విఖ్యాతియును, ధ్వనులకు నునికియును, ఉక్తాత్యుక్తాదిగాఁ గల