Jump to content

పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



ఉపోద్ఘాతము


ఆంధ్ర వాజ్మయపరిణామమును బట్టి విమర్శకులు దాక్షిణాత్యాంధ్ర వాజ్మయకాలమును క్షీణయుగ మనిరి గాని వాస్తవముగా మధుర తంజావూరు పుదుకోట మొదలైన ప్రదేశములలో తెలుగు పలుపలు విధముల వర్ధిల్లినది. ఆంధ్రభాషావధూటికి అలంకారప్రాయములైన అమూల్యాభరణములవంటి ప్రబంధరాజములను ప్రసాదించినది. అట్టి మహాకావ్యములలో నీ ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసమొకటి. భాషావధూటికి వట్టి అలంకారప్రాయము మాత్రమేగాదు శబ్దాలంకార అర్థాలంకార వాజ్మయమునకు ఆదర్శప్రాయమై శిఖరమును తాకినది. చతుర్విధకవితలను గుఱించి ఎందఱో చెప్పియున్నారు. చేసినవారు చాల తక్కువ. వారి రచనలన్నియు మనకు దక్కనులేదు కాని ఇతఁడు చేసినంత గ్రంథము మఱియొకటి మనకు లభింపలేదు. చిత్రకవిత్వములో ఇంతటి కావ్యముగాని దీనికి ఇంచుమించు దగ్గరదిగానో రెండవదిగానో చెప్ప దగిన కావ్యము గాని లేదు. తమ తమ కావ్యములలో ఎక్కడనో చిత్రబంధ కవిత్వములను రుచి చూపినవారున్నారుగాని ఈ విధముగా ఆంధ్రభాషలోనే ఆలంకారికులు చెప్పిన లక్షణములు కన్నిటికీని లక్ష్యసాగరముగా నొక కావ్యమును వ్రాసినవాడు ఇంకొకఁడు లేఁడు.

ఈ యపూర్వకావ్యమును నేటికి 88 సంవత్సరముల క్రింద నెల్లూరి శ్రీపూండ్లరామకృష్ణయ్యగారు సంపాదించి ఐదాఱు ప్రతులు తెప్పించి పరిశోధించి చక్కని పీఠికతో ప్రకటించినారు. ఆ ప్రతులు ఇప్పుడు దొరకవు సరిగదా అక్కడక్కడ మిగిలియుండు ఒకటిరెండు ప్రతులుకూడా తాకిన పొడి పొడియై పోవు స్థితిలో నున్నందున ఇప్పుడు నా కోరికను మన్నించి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీవారు దీని పునర్ముద్రణమునకు ఉద్యుక్తులగుటయేగాక ఆ సంపాదక కార్యమును కూడ నాకే అప్పగించినందున వారికి కృతజ్ఞుఁడను. ప్రౌఢమును అలంకారభూయిష్ఠమును అపూర్వపదప్రయోగభూయిష్ఠమునైన యీ ప్రబంధమునకు చక్కని వ్యాఖ్యయు చిత్రబంధాదులకు కావలసిన చిత్ర