పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/47

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

xxxxviవేంకటపతి కవిత్వాతిశయమును నిర్ధారించుటకది సహకారి కాజాలదు...లభించిన గ్రంథములలో నితని ప్రబంధరాజవేంకటేశ్వర విజయవిలాసము గొప్పది. అదియు నమూల్యమైన లక్షణగ్రంథమేకాని, తన్మూలమున నతని కవితాశ క్తిని కొంతవఱకు గనుగొనవచ్చును. అతఁడు మహాసమర్థుఁడని యఱమరలేక పల్కవచ్చును. అతని పాండిత్య మద్వితీయము, శాస్త్రపరిచయమును లోకజ్ఞానమును అసాధారణమైనవి. ఛందోవ్యాకరణాది శాస్త్రవిచారమున కొంతయెగుడు దిగుడు గానవచ్చుచున్నను శైలి మొత్తముమీద సా ఫైనదే. పదముల కూర్పునను గర్భచిత్రకవిత్వ రచనలయందితని నేర్పు మఱియెవ్వరికిని లేదు ......బళి ! బళి ! యని మెచ్చదగదా యిట్టి యనన్యసామాన్య రచనా కౌశలమును. కాని ఇది యంతయు శతసహస్రావధాన కౌశలమువంటిదిగాని యుత్తమ జాతికవిత్వము కానేరదు."

ఈ మహాకావ్యమునకు చక్కని విపులవ్యాఖ్యను మహాపండితు లెవరైనను వ్రాయుట దేశోపకారకము. ఈ విధముగానై నను ఈముద్రణమును ప్రకటించుటకు నాకీయవకాశమిచ్చిన ఆంధ్రప్రదేశ్ సాహిత్యఅకాడమీవారికి చాల కృతజ్ఞుడను.

30_11_1976
మదరాసు_1