XXXXV
78 వ జాతివార్తా వచనమున స్వామి 'వేంచేయునవసరంబున గురు మహా ప్రధాన మాండలికసామంత ...' ఇత్యాదిగా ప్రారంభించి రాజాస్థానముల యందలి దెబ్బది రెండు నియోగాలవారిని చెప్పినాఁడు.ఆంధ్రవాఙ్మ యములో వీనిని మొదట పేర్కొన్నవాడు పాల్కురికి సోమనాథుడు. (క్రీ.శ. 1800– 1828) ఆ వచనమందే ఉత్సవయాత్రావర్ణనలో జనుల వేషభాషావైఖరుల వర్ణించుచు అపూర్వపదములను జాపితాగా గ్రుచ్చివాని సంఖ్యలను కూడ తెలిపినాడు. 'చౌశీతి బంధపు వ్రాతపని ప్రతిమల చుట్టంచు చందురుకావి దుప్పటి బంగరు చెఱఁగులవలె వాటులును’ తర్వాత 'పదిరెండుదండ' లట, 'పదిరెండు పరువడు'లట 'గతులు పదిపండ్రెండట,'పదిరెండు గాయమానంబు' లట, “పది రెండు మొనలట `ఇట్టి వెన్నియో! సంగీతవర్ణన వచ్చినచోట సంగీతశాస్త్రోపన్యాసమే. నాట్యవర్ణనమునకు ప్రారంభించిన భరతనాట్య గ్రంథమునకు పునరుక్తియే. ఒకనాట్య ప్రదర్శనమునే వర్ణించినాఁడు. భోజనాదినైవేద్య వర్ణనల సందర్భమున నాటి ధాన్యపు దినుసుల, జాపితాను, భక్షణముల పణ్యారముల జాపితాను, పండ్లదినుసులు, తేనెలదినుసులు, చక్కెర పిండి వంటకముల దినుసుల జాపితాను,- ఈ విధముగా భాషకేగాక నాటిదైనందిన వ్యవహారమున నుండిన సకలవస్తు జాలమునకును, సకల విషయములకును సకలానుభవములకును, జాపితాలను తన కావ్యములోకూర్చి సాంఘిక చరిత్రకారులకు కావలసిన సాధన సామగ్రిని నిఘంటువువలె ఇచ్చినాఁడు. వీరి నెల్లనొక యకారాది క్రమమున వ్రాసినయెడల అదియొక చక్కని సాంస్కృతిక విషయనిఘంటువగును.
ఇట్లెంతైనను వ్రాయుటకు అవకాశముకలదు. ఆంధ్రవాఙ్మయ మందుగాని సంస్కృత వాఙ్మయమందుగాని ఈకవి యెఱుఁగని లోతు పాతులు గాని, చెప్పని విషయములుగాని కానరావు. ఈతనిగుఱించి తమ దాక్షిణాత్యాంధ్ర సాహిత్య చరిత్రలో శ్రీ డా. నేలటూరి వేంకటరమణయ్యగారిట్లు వ్రాస నారు. “వేంకటపతిని కవియని పేర్కొనుట కంటె శాస్త్రకర్తయనుట యుక్తము. పద్యములను ఛందోవ్యాకరణాది దోషములు లేక వ్రాసినంతటనే కవితాప్రతిభ లేనివాఁడు కవి కాజాలఁడు. వేంకటపతి వ్రాసిన గ్రంథములలో నేయల్పసంఖ్యా కములోతప్ప తక్కినవన్నియు ఛందోవ్యాకరణాలంకార శాస్త్రములకు సంబంధించినవే. శాస్త్ర విచారమునందు కవితా ప్రదీపనమునకుగాని భావవిలసనమునకుగాని యవకాశ మధికముగనుండదు. .... కాని ఎట్టి యుత్తమలక్షణ గ్రంథమైనను