Jump to content

పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xxxxiii

రెండును, ప్రాకృత భేదములగు శౌరసేన్యాదులైదును నాంధ్రభాష యొకటియు జేరి యష్టభాషలు నాఁబడు. చక్కఁగ సంస్కరింపఁబడినదిగాన సంస్కృత మనఁబడును. ఇది యెల్లభాషలకుఁ దల్లియగుకతన స్వర్లోకప్రశస్తము. మహారాష్ట్ర దేశీయంబు ప్రాకృతంబు. శూరసేని దేశీయంబు శౌరసేని. మగధ దేశీయంబు మాగధి పాండ్యకేకయబాహ్లికానూప గాంధార నేపాళకుంతల సుధేష్ణ భోజకన్నోజకంబులఁ బొసఁగు మాటలు పైశాచి చూళికలనంబడు. ఆభీరవిషయ జాతము అపభ్రంశము. ఇయ్యాంధ్రదేశములోని భాష ఆంధ్రమనఁబడు, కావ్య నాటకాదులయం దొక్కక తెగవారికి నొక్కొక భాషవిధింపఁబడియున్నది, ... పైనుదహరించిన భాషాష్టకోత్పత్తి వివరణము అప్పకవీయము, అహోబల పండితీయమునుంచి యిందు వ్రాయఁబడెనుగాన నందుఁ జూచిన విశదముగఁ గోచరించును. దశావతారచరిత్రయందు బ్రాకృతభాషాగ్రధితమగు నొకసీస పద్యము మాత్రము గనుపడుచున్నది. ఇయ్యష్టభాషామిళితమగు పద్యములు గ్రంథములయందగుపడుట యరుదుగ నున్నయది.

(28) ఈ గ్రంథమునందలి 880వ, నమస్కారశబ్దలక్షిత కంద ద్వయ గర్బిత వచనమున నూటయెనుబది దివ్యతిరుపతులను గుఱించి వ్రాయబడియున్నది...నమస్కారశబ్దపర్యాయము లుభయభాషలలోనివి జేర్పఁబడినవి. ఇట్టి విషయములను దెలుపు పద్యము లెచటను గన్పట్టవుగాని యయ్యలరాజు నారాయణామాత్యునిచే రచియింపఁ బడిన 'హంసవింశతి' పద్యకావ్యము చతుర్థాశ్వాసమున మంజుగతి రగడయందు దివ్యతిరుపతులను గుఱించి వ్రాయఁబడియున్నది. ఈ గ్రంథద్వయములోని నమస్కారశబ్దలక్షితములను దివ్యతిరుపతుల నామములను పోల్చిచూచిన నించుమించుగా సరిపోవుచున్న వి గాన నీ గ్రంథముల పౌర్వాపర్యము నరయునది. దివ్యతిరుపతియనఁగా వైష్ణవ ఆళ్వారాదులచే మంగళాశాసనము చేయఁబడిన శ్రీవైష్ణవ క్షేత్రమునకుఁ బేరు. అనఁగా దీర్థప్రసాదాదుల కర్హక్షేత్రము.

(29) ఈ గ్రంథమునందు 288వ పద్యము మొదలు 321 వఱకును మఱియు 393 మొదలు 510 వఱకును నలుమేలుమంగాభివర్ణనము వివిధాలంకారములతో వ్రాయఁబడియున్నది. సమిష్టిమీఁద నూఱు నూటయేఁబది స్త్య్రవయవవర్ణనమునకై వినియోగింపఁబడియున్నవి. తెలుఁగుప్రబంధములయం