పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/39

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

xxxviii

దక్కిన కందభేదము లీ గ్రంథమునం దొక్కటియైన నగుపడదు. 372వ పద్యము మాత్రము ఛన్నకందమని వ్రాయఁబడియున్నది. దీనిలక్షణ మెచ్చటను గన్పట్టదుగాన నిది విచార్యము. ఈ కందషట్కమునకు నప్పకవీయమున లక్షణము వ్రాసియున్నది. ఈ కంద భేదము లెచ్చటను ప్రయోగింపఁబడని కతన వాని లక్షణములను నిందు వ్రాయుట ననుపయోగమని యెంచి పీఠికావిస్తరణ భీతిచే విరమించుచున్నారము.

(22) ఈ గ్రంథమునందు 144వ పద్యము ఆర్యాగీతిరూపకందమని వ్రాయఁబడియున్నది. అప్పకవీయమున నుద్గీతి, యుపగీతి, ఆర్యాగీతి, కమలనగీతి పవడ గీతి యని వ్రాయఁబడియున్నవి. ఈ గీతి భేదము రెండును బ్రయోగింపఁ బడియుండుట గానము. ఇందుఁ బొందుపఱపఁబడిన ఆర్యాగీతికి మాత్రము లక్ష ణము వ్రాయుచున్నాము.

          22. “సమురిదీత పథ్యాకం
               దముకన్నను నొక్క గురువుఁ దాఁకించినచో
               క్షమనార్యగీతి యగున్
               గమలాప్రాణేశ సహజ కందం బదియే.”

          ఇఁక పథ్యాకందలక్షణము జూడుఁడు.

          23. “ధరలోఁ బథ్యాకందము
               హరియగు నాఱవయెడ నల మాఱింటింబై
               విరతియుఁ గూడఁగ మూటను
               నెరయుఁ జతుర్గణములుగము నిలిచిన చోటన్.

(23) నరసభూపాలీయమున నరసరాజు మూర్తికవిచంద్రుని

          24. సీ. బాణవేగంబును భవభూతి సుకుమార
                        తయు మాఘశైత్యంబు దండి సమత
                 యల మయూర సువర్ణకలన చోరుని యర్థ
                        సంగ్రహమ్ము మురారి శయ్యనేర్పు
                 సోమప్రసాదంబు సోమయాజుల నియ
                        మంబు భాస్కరుని సన్మార్గఘటన
                 శ్రీనాథుని పదప్రసిద్ధ ధారాశుద్ధి
                        యమరేశ్వరుని సహస్రముఖ దృష్టి