Jump to content

పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/336

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నిర్మాణచణప్రభావం మహానుభావం కలాపాలికావిజ్ఞానశాలినం, వనమాలినం కలాపాళీకాడంబినీనీలకచకలాపం భంజితశివచాపం, కలాపాళికాఘటితభవ్యకావ్యరసానుభవశోభినం, రాధాధరసుధారసధారాలోభినం, కళాపాళికాలంకృతసకలాంగం, నిర్భిన్నకపటకనకసారంగం, హృదయవిలసదలమేల్మంగం కరుణాతరంగితాపాంగం, సనకసనందనాదిమునిజనాంతరంగం, వనజసారంగం, ఆనందనిలయ మానందనిలయవాస్తవ్యం, శివాస్తవ్యం, దివ్యం, శ్రీవేంకటేశమతివిశంకటప్రకాశం, సకలదేవతాధీశం, అమీవయం భజామః 875

ప్రాకృత శౌరసేని మాగధ పైశాచి చూళికా అపభ్రంశ సంస్కృత ఆంధ్ర అష్టభాషాసీసము
సీ. ణాయమాణస్సిణీ ళోయ ధమ్మిళ్ల పజ్జణ్ణ యవిజ్జుళా సరిసపాయ
ఛాయ. (నాకమనస్వి నీలోకధమిల్ల పర్జన్యక విద్యుతి సదృశపాద)
పురవదేవ్వ విదాణ గరువమరట్టదుఃఖట్ట జాద విజేయ కళనసీహ
ఛాయ. (పూర్వదేవ వితాన గర్వమదోద్ధతగజ జాత విజవన కలన సింహ)
చళనశాళస నిళంతళ భత్తచిందితపళశమస్తనకేళి పారియాద
ఛాయ. (చరణ సారస నిరంతర భక్త చింతిత ఫలసమర్ధనకేళి పారిజాత)
మతనసూతనధేరతిత శవళ్లహముహగననిజ్జగల్లానగు నదురీన
ఛాయ. (మదన సూదన ధాతృత్రిదశ వల్లభముఖ గణనీయ కల్యాణగుణధురీణ)
గీ. కందకచళా చలఖ్కణ పంధుళాళి
ఛాయ. (గంధ గజరాజరక్షణ బంధురారి)
మహయముఖధి కరీ హేదు మహపడుఝ్ఝ
ఛాయ. (మగువ ముఖాశ్చర్య హేతు సమ సమూహ)
ఆజవంజవ జలధిమగ్నాత్తతరణి
మబ్బుపూఁబుట్టువు బిడారు మగువఱేఁడ. 876

శీర్షిక - (ఆది పాదైకైక చరణానులోమ ప్రతిలోమోష్ఠ్యాచలజిహ్వికా గోపన గోమూత్రికాబంధ తత్పాదార్థభ్రమక గోమూత్రికాబంధ పతకబంధ పాదుకాబంధ నవరంగ సమపంచాక్షర ఖండ చతుష్టయాక్షయ దళోపరినిరోష్ఠ్య పూర్వోవిధ నియమ ద్విచరణ దళోపరి పూర్వోక్తానులోమవిలోమ నియమ నాతిక్రమ్య దళాద్యక్షర నియమపాదద్వయోపరి చరణద్వయ ప్రత్యైకానులోమ నియమోపరి దళచతుష్క ప్రత్యైకపాద