పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/316

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నవాక్షర సమవృత్త కందద్వయ మణిగణనికరగర్భిత సరసిజవృత్త పంచవిధవృత్తము
సరసిజవృత్తము
శ్రీలోలా చంద్రాలయ చేలాశ్రిత । సురచయ తనుజిత సజలఘనా
వ్యాలగ్రావావాలదయాళూ । హతదితి సుతపతిహరి సమగమనా
బాలార్కాభాశైల దపాలా । ప్రతతభువనచయభరణ నరసఖా
జాలోద్వేలా ఖేలనశైలీ । సతతము గొలుతుము సరవి మనుపుమీ. 818
(ఈవృత్తమున నేకతాళి యర్ధచంద్రిక లెనిమిది ఱేకులు సరిగాఁ బొందుపఱచి యున్నవి గాన సరిచూచుకొనునది. (పూ.రా.))

1. గర్భిత నవాక్షరపాద సమవృత్తము
శ్రీలోలా చంద్రాలయ చేలా । వ్యాలగ్రావావాల దయాళూ
బాలార్కాభా శైలదపాలా । జాలోద్వేలా ఖేలనశైలీ

2. గర్భితప్రథమకందము
శ్రీలోలా చంద్రాలయ
చేలాశ్రిత సురచయ తనుజిత సజలఘనా
వ్యాలగ్రావావాలద । యాళూ హతదితి సుతపతి హరిసమగమనా

3. గర్భితద్వితీయకందము
బాలార్కాభా శైలద । పాలా ప్రతతభువనచయభరణ నరసఖా
జాలోద్వేలా ఖేలన । శైలీ సతతము గొలుతుము సరవి మనుపుమీ.

4. గర్భితమణిగణనికరవృత్తము
శ్రిత సురచయ తనుజిత సజలఘనా
హతదితి సుతపతిహరి సమగమనా
ప్రతతభువనచయభరణ నరసఖా
సతతము గొలుతుము సరవి మనుపుమీ.

ఏకసమాససీసము - అపూర్వప్రయోగము
సీ. కలిగెఁ గానిపు డబ్జదళగళన్మకరంద
ఝలతుందిలమిళిందకులనినాద
డిండిమమండలీఢిమిఢిమినిర్ఘోష
విలసితశోణకువలయముకుళ