పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/315

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంస్కృత విభక్త్యంతసీసము
సీ. తావక నగజల స్నాత పాపహరాయ
యతిమాత్ర సాధన జ్ఞానదాయ
యాపద్దశాప్తి వేదండ భీదళనాయ
రాజితశ్రీవత్సలక్షణాయ
వాఙ్మదుభవగీతలగ్నచేతస్కాయ
ముచికుంద ముఖభక్తపూజితాయ
తతవీచిమాలి బంధాగ్రనాళీకాయ
పార్వతీప్రాణేశవర్ణితాయ
గీ. జలజవాస్తవ్యకలశీకుచప్రియాయ
పరశురామవిపాటనభంజనాయ
సవనధారీశరీరాయ శంఖచక్ర
హస్తపద్మయుగాయ తుభ్యం నమోస్తు. 816

చతుర్విధకందము
1. వనజాయతాక్ష వాసవ
వినుతా యురగేంద్రశయన విశ్రుతచరితా
వినతా సుతాశ్వశరజిత
వనధీ తిరువేంకటేశ వారణవరదా. 817
2. ఉరగేంద్రశయన విశ్రుత
చరితా వినతా సుతాశ్వశరజిత వనధీ
తిరువేంకటేశ వారణ
వరదా వనజాయతాక్ష వాసవవినుతా.
3. వినతా సుతాశ్వశరజిత
వనధీ తిరువేంకటేశ వారణవరదా
వనజాయతాక్ష వాసవ
వినుతా యురగేంద్రశయన విశ్రుతచరితా.
4. తిరువేంకటేశ వారణ
వరదా వనజాయతాక్ష వాసవవినుతా
యురగేంద్రశయన విశ్రుత
చరితా వినతా సుతాశ్వశరజిత వనధీ.