బుధులును గురులును పుణ్యులు
నుతులుంచు మురువుకు శ్రుతులు గుఱుతు
లుగ జగత్రయి ధగద్ధగల గత్ఖగవర
ధ్వజమరుద్ధతిఖల ధ్వజినిమ్రగ్గ
గీ. నమరు మరుఁగన్నజియ్య దృప్తమరుజియ్య
జియ్య విశదాంతరీపనికాయ్య భుజగ
శయ్యపావళీసమిద్ధాయ్య సమితి
శాయ్యనర్ఘ్యగుణాక్షయ్య చక్కనయ్య.
చిత్రసీసము
సీ. నీరజదేహకాంతి రజనీకర వక్త్ర
జలధినయన రవి శశినయనయు
గా రజనీచరవార దళారిక
రాఫణిపతికు ధరవర నిలయ
గరుడ తురంగ చంక్రమణ కౌతుకచిత్త
వారిజోదరనర వాసవనుత
మహిమ యలర్మేలుమంగా హృదంబుజ
భృంగాయనాథాంతరంగ కువర
గీ. పారికాంక్షికరక్ష పంకేరుహాక్ష
చారుకౌస్తుభవక్ష జన్యారిశిక్ష
పురహరణ సఖయమరకింపురుష గరుడ
సిద్ధసాధ్య విద్యాధరసేవితపద. 812
ఏకగణయుక్తైక నియమానుప్రాస షట్కఘటిత చరణాక్కిలి వడి సీసము
సీ. తులలేని యలమేని కలవోని వలఱేని
సొలపాని కలనూని నిలఁగలాఁడ
అరిదాపు తరిరూపు కరిదాపు దరిజూపు
నరిపైపు నెఱిప్రాపు కరమువాఁడ
పొగరొందు తొగవిందు సిగబొందు తగఁజెందు
మగపొందు సొగసొందు మగువతోడ
యలమించు నలమించు తలమించు తలమంచు
నలయించు చలముంచు వలపుఱేడ
పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/313
Jump to navigation
Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
