xxvi
క్రీ.శ. 700 ప్రాంతముగాన ఎనిమిదవ శతాబ్దమునకే చిత్రబంధరచన ప్రాముఖ్యమునకు వచ్చినది. ఇందులో సంప్రదాయభేదములు కవుల ప్రతిభ చేతనో లేక దేశకాల వ్యత్యాసములచేతనో కనఁబడుచున్నవి. చక్రబంధములు ఆంధ్రమున చాలవఱ కొక్కతీఱుఁగా నున్నవిగాని ఇటీవలివాడైన వావిలాల వాసుదేవశాస్త్రిగారు తామే మార్చిరో లేక ఏదైన సంప్రదాయ మనుసరించిరో తెలియదు. (చూ. ముందు)
అందరిని మించి మనకింకను చిక్కులు పెట్టుటకు నన్నె చోడుఁడు తన చక్రబంధమున కృతిపతి కృతిక రృ నామములు వచ్చునట్లు వ్రాయలేదు. వలయమునందు మూఁడవ యక్షరములను చేర్చిన ‘ములకం సేషైక” అనియు, ఆఱవ యక్షరములను చేర్చి చదివిన “నామమందై దేవ' అనియు నగుచున్నవి. అర్ధమేమో తెలియుటలేదు. ఇది నన్నెచోడును ప్రాచీనత కొక కారణము.... ఈవిధముగానే కవి రాజమార్గమను ప్రాచీన తమ కావ్యములో నీ నియతి కానరాదు. ఈ మర్యాద యిటీవల బుట్టెనని తోఁచుచున్నది' అని శ్రీ మానవల్లి రామకృష్ణ కవిగారు 1914 లో (కు. సం. ద్వి. భాగ పీఠిక) వ్రాసినారు. ఒకవిధముగా ప్రాచీనతను సూచించుట వాస్తవమేగాని ఏ కాలమును? ఈశ్వర భట్టోపాధ్యాయుని చక్రబంధమున కవియొక్కయు కృతిపతియొక్కయు నామములు గలవు. కాని శ్లోకమది. సంస్కృతము. శాసనముయొక్క తారీఖు క్రీ. శ. 1259 దీనినిబట్టి నన్నె చోడుడు సంప్రదాయమును ఎఱుగఁడని చెప్పవలయును. ఆట్లైన 1259కి ముందువాఁడగును. అది కుదురదు. 1259 నాటి తిక్కన యున్నాడు. షష్ఠ్యంత సప్తసంతాన కృతి ప్రారంభకర్త వ్యాద్యనేక విషయములచేత ఇతడు తిక్కనకు తర్వాతివాఁడుగాని ముందువాఁడు కానేరడు. కాబట్టి ఈతఁడు భిన్న సంప్రదాయ మైనను అనుసరించి యుండవలెను, లేదా ఈశ్వరభట్టుని సంప్రదాయ మింకను ఆంధ్రకవిత్వములోనికి ప్రవేశింపలేదని యైనను చెప్పుకొనవలయును. కావ్యాలంకార చూడామణిలో ఈశ్వరసూరి పద్దతియే యున్నది. విద్యానాధుని లక్షణ లక్ష్యములలో ఈశ్వర సూరి పద్ధతి వచ్చిన తర్వాతనే ఆంధ్రకవు లీమార్గమును గ్రహించిరేమో ! ఇందువలన నొక విషయము తెలియుచున్నది. గీర్వాణాలంకారికుల పద్దతులు ఒక వాహినిగా ఒక్కుమ్మడిగా ప్రవేశింపలేదని నన్నెచోడుడిందువలన ఈశ్వర సూరి విద్యానాధుల నడిమివాఁడు కాఁదగును.
శ్రీ పూండ్ల రామకృష్ణయ్యగారు ఈ కవియొక్క బంధగర్భ చిత్ర కవిత్వాదులను గుఱించి చాల వ్రాసియున్నారు. వీరియుపోద్ఘాతముకూడ మరల