పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/240

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సీ. రవి కిరణాళి దూరఁగనీకఁ గార్కొని
తఱుచైన యుపవనతరుల గములఁ
బూఁదేనెసోనతుంపురు జాలువాఱిన
గాల్వల నివమైన గప్పురంపు
టిసుముదిన్నెలమీఁద నెసఁగు గొజ్జంగుల
వలనైన నాలచ్చికొలనియందుఁ
గలహంసబకచక్రకలరావముల్ తమ
వీనుల కింపుగా విని మనమ్ము
గీ. లమ్మనమ్ములు చూపుదనమ్ము నమ్మ
కామినుల నవ్వు తేటలఁ గరఁగు గలువ
విందుఱా మెట్టులను గల పెండ్లిచవిక
లోన వెన్నుని నునిచి తోడ్తోనఁ గనఁగ. 567

ఉత్ప్రేక్షాలంకారము
క. మొదలన్ మదిగల చంద్రము
డుదయం బగువేళ నుదుట నుంచిన కావున్
గదయన హరిపేరెదపైఁ
బదలిగ శ్రీవత్సకౌస్తుభద్వయ మలరెన్. 568

వ. అని యబ్బురమంది చుట్టుల మందిగల నిలాతలప్రతిజతనంబునఁ దన కుమారికయైన యలమేల్మంగనాంచారును తోడి తెమ్మని బువ్వారుఁబోండ్లఁ బంచిన వల్లెయని వచ్చి యచ్చేడియలు తమతమ యిచ్చల మెచ్చు వెచ్చ విచ్చలవిడి నచ్చెంగట నున్న మానికపుబొమ్మ మానినిం గనుంగొని ప్రేమాని యమ్మా నీకోర్కు లీడేఱె లెమ్మని నీనెమ్మదిం దలంచిన వేంకటాచలపతి నీపతి యగుటకు నతివేగముగాఁ దోకొనివచ్చి పెండ్లిచవికలో వసియింపఁజేసి నిన్ను వెన్నునకు సాకల్యముగాఁ గల్యాణంబు సేయందలంచి మీతండ్రి దయార్ద్రహృదయుండై ధృతి నినున్ బిలుచుక రమ్మని ప్రేమమ్మున మముం బంపెనని పలుకు నప్పట్టునఁ బట్టజాలని సంతోషంబు హల్లీసకంబు సలుప మందాక్ష