పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/238

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దత్పాపంబుల నెల్ల బాపఁగల దిష్టముదిష్టమీమహిమ నుతిసేయఁగలరసజ్ఞ రసజ్ఞ యనిన వినిన నిజతీర్థనిమజ్జనాగతసజ్జననభోభువద్దరిద్రతావిద్రాణంబును, సౌఖ్యసమాచక్రసాన్వితజంతుసంతానకలకలోన్నిద్రాణంబును, తామరసికదామరసికాభ్యుదయాదరిత్రాణంబును, వయోరిరంసాయాతదేవకామినీకుచకుంకుమపంకముద్రాణంబును, సమ్మతతపఃఫుల్లహలకారుణారుణప్రభావిద్రావితసమీపవనాంతరాథఃకరణాంధకారంబులు సంతతవసంతశ్రీజరీగృహ్వమాణామితసితాబ్జప్రకారంబును, అగాధాధరప్రదేశపంమాశబ్దికద్విరేఫజాజాయమానఝంకారంబును, చక్రచంక్రమణవర్తులాకారంబును, దురితవ్యవహారకైకాగారికశరణ్యరణ్యనిసాధ్వసకారణశ్రమయుతాధ్వనీనజరీజృంభ్యమాణనిష్టాపముష్టింధయసమీచీనవాచీనబాలపల్లవమానంబును, పశ్యల్లలాటజేగీయమాననూనచరీదృశ్యమానంబును, ప్రతిఫలితగతాగతగంధర్వవిమానరారజ్యమానంబును, యోజనాయలమానంబును, చకాసత్కల్లోలహల్లీసకహల్లోహలతమసారంబును, పరివసన్మదయుక్తకోకసారసంసారంబును, కేవలశేవలవిభానిరస్తమసారంబును, వారిమధురతాజితసుధాసారంబును, నిరవత్కైరవప్రసారంబును, విధుకాంతకాంతసోపానవికాసారంబును, నిరంతరపారదృశ్యవిజఠిహృద్విసారంబును, మానసరసంసారంబును నగునాకాసారంబు దరిసి క్రిక్కిరిసిన సొంపున మెఱసి, కరిని డిగ్గి, హరియందు మంగళస్నానం బొనరించి, చెంతనున్న నాప్తమంత్రినిం గనుంగొనిన స్వామిచిత్తం బెఱింగి, తత్కృపాపావనుండయి యాదండనాథాఢ్యంభవిష్ణుండు, విష్ణువు నలంకరించ నుద్యోగించి యంత. 561

క. క్రొవ్వాఁడి నఖంబులచే
దువ్వి హొయ ల్మీఱవైచు తోరపుసికపై
జవ్వాజితావి గట్టిన
పువ్వులసరు లతఁడు జుట్టి భుగభుగ వలువన్. 562

ఉపమోత్ప్రేక్షసాంకర్యము
సీ. తూర్పుగుబ్బలిమీఁదఁ దోఁచిన రవిభాతి
డాలీను బురుసారుమాలుఁ గట్టి
కాటుకకొండపైఁ గప్పు లేయెండనాఁ
గటితటిఁ గాంచనపటముఁ జుట్టి