పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/202

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

త్రిప్రాసకందము
క. క్షీబాళి కబరి చెందిర
శాబాళిక కేళి నీకు చక్కని బాబా
యేబాలిక తలఁపున నిడు
నీబాళికిఁ దగిన యినుని నే దెల్పెదనే. 434

ఉ. ఏమని యెంతునో చెలియ యే నిపు డాజలజాక్షువిభ్రమ
శ్రీమహితాకృతిన్ వినుతిఁ జేసి నలున్ నలకూబరు న్మరు
న్వేమఱు నెన్న నందునకు వేయవపాలికి సాటిరాదనన్
భూమిపశేఖరాత్మజులఁ బోల్పగ వచ్చునె యీడు జోడుగన్. 435

బిబ్బోకము
ఆ. అనుచు మఱియుఁ గరతలామలకంబుగాఁ
దెలుప వినిన యంతఁ దలిరుఁబోఁడి
కపుడె యతని మూర్తి యద్దంబులోఁ గానఁ
బడినయట్ల మదిని బొడమునంత. 436

క. కొమ గళశంఖము కటిచ
క్రము జంఘాగదయు రోమరాజీఖడ్గం
బమితభ్రూచాపము భూ
న్కి మహాచ్యుతరూప మందెఁ జెలు లరుదందన్. 437

వ. అట్టిపట్టున.

క. ఖరకరుఁ డంబరమధ్య
స్థిరుఁడై గనుపట్టె రుచిరదీధితిని వియ
ద్విరదమున కంశురజ్జువు
గరమొప్పఁగఁ గట్టుబొడ్డుఘంటయ పోలెన్. 438

అపూర్వప్రయోగము
ఉ. ఆరవి రశ్మిచేత విపినాంతరవిహారమునందు డప్పి లో
నారమి మంత్రిఁ జూచి సఖియా శ్రమ మెల్లను దీర్ప నొక్కకా
సారము లేదె యన్న గడుఁజల్లనినిర్మలతోయ మున్న దీ
చేరువ నంచు నాహరిని శీఘ్రమె దోకొని వచ్చు నయ్యెడన్. 439