పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/188

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ధర ద్రుహిణాఖండల త్రిపాద్విభావసూద్భవ నార్కాదార్ణోధి పాశుగైలబిలోక్ష ప్ముఖ కకుప్పరివృఢార్జున కిరీట ఝాటస్థగిత చిరత్న రత్న నిర్యత్న ప్రభానీరాజితాంఘ్రి పంకేజ దేదీప్యమానాత పత్రీకేతనాహలకులిశకలశాంకుశరేఖాప్రచండచండ తేజోవిరాజత్పాఠీనకమఠస్తబ్ధరోమ నృహర్యక్ష త్రివిక్రమ కుఠారభృద్దాశరథి ప్రలంబజిత్ప్రబుద్ధ గంధర్వరూప శ్రీకృష్ణాద్యవతారాఖండపరశుప్రేయస్యహల్యా ద్రౌపద్యాటవిక పాటలాధరాదేవ భూతిక్ష్మాసుర భార్యాత్రివిక్రా భీరికాగణ్య పుణ్యప్రమదామోక్షభోగప్రదాన శ్యౌండ పాపర్య మాననిజకథాతుంబురునారదగాయకాభిధేయళిమతాపత్రయ వైయాసక ప్రభృతి భక్తజనవిధేయక వక్షస్థలప్రాలంబమానకౌస్తుభగ్రైవేయక కటీరన్మస్త కౌక్షేయక ప్రహ్లాదాది పరమభాగవత చింతిత ఫలదాయక వేంకట శైలనాయకా పాహిమాం పాహిమాం పాహి.

వర్ణవృత్తి వృత్తములు కదళీపాకము ప్రాసభేదము
శా. వేదోద్ధారక వేణునాదకుతుకా వేల్లత్కృపావీక్షణా
వేదాంతాటన వేదనావిరహితా వేశ్మీకృతాబ్ధిస్థలా
వేదిశ్రోణిరమేశ వేషదశకా వేదస్ఫురద్విక్రమా
వేధోండావన వేంకటాచలపతీ వేదండరక్షాకృతీ. 379

మ. కరిసంరక్షణ కామపాలసహితా కంజాక్షకాకోదరే
శ్వరతల్పా కమనీయరూప కనకాక్షధ్వంస కారుణ్య సా
గర కల్యాణమయాంబరాంతకటిభాగా కంససంహారకా
తరసందోహ భయాపహారి కలితా తార్క్ష్యాఖ్యగోత్రాధిపా. 380

చ. శరధియాన శార్ఙ్గధర శంఖశశాంక దివాకరాక్షశం
బరహర శౌరి శుక్రమణి భాసురభాసిత తాటకేయ శం
కరసఖ శాశ్వతాశరవిఖండితవాసవిశౌర్యధుర్య శం
బరజభవాండపాలిక శమప్రదభద్రమహీంద్రవల్లభా. 381

చ. నరసఖ నవ్యరూప నరనాథశరీరగ నక్రకుండలా
భరణ నగాత్యజావినుత పావననామక నందనందనా
నరహయమిత్రచాపధర నారదగా నసకౌతుకానతా
దర నవనీతచోర నయదానవినోదర నాగభూధరా. 382