పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/187

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బహువిధోల్లేఖాలంకారము
సీ. ప్రాగ్దిశాపరివృఢ భామినీకబరీషు
జ్వలనసీమంతినీ గళతటేషు
ధర్మరాజాంగనోదారవక్షోజేషు
నైఋతికాంతాఘనజఘనేషు
వరుణసతీమణి వరకర్ణపత్రేషు
హరిణాశ్వవనితారుణాధరేషు
యక్షకులాధినాయకవధూనిటలేషు
పురహరమానినీకరతలేషు
గీ మానసూనంతి హారంతి మలయజంతి
ధవళచేలంతి వజ్రంతి దరహసంతి
నవసితాభ్రంతి ముకురంతి తవయశాంసి
పంకరుహబంధుసంకాశ వేంకటేశ. 376

క. హరయే దుష్టక్రవ్యా
దరయే దానవమదేభహరయే ధృత స
ద్గిరయే పరిపాలితశాం
కరయే తుభ్యం నమోర్యకలయే యనుచున్. 377

ముక్తపదగ్రస్తనిస్తుల్యకైవారగద్య
శ్రీమద్రమారమణీమణీసముజ్జ్వల హృజ్జలజాతమార్తాండ, తాండవాడంబరసంభృతానల్పాకల్పజటాకుటీరజటాజూటకోటీరనానటద్గగన గంగాతరంగాభంగురఘుమఘుమారావచమత్కారధిక్కారగంభీరవచోనిగుంభిత పదబంధానుసంధానబంధుర ప్రబంధధౌరంధర్య వామలూరూద్భవవ్యాసప్రముఖకవిరాజ సంస్తూయమానగుణప్రకాండ, కాండముక్సముద్భూతగర్జానిర్ఘోషభీషణదరీఢౌకమాన భూరిఝారిసముత్పతక్షిప్రావసరోద్ధగుబగుబచ్ఛందైందమానబుద్బుదపాణింధమ శీతలకబంధవిధూతాఘౌఘతీర్థరాజకాండ, కాండచ్ఛటాసంభరణోదరత్వదియ్య మహిమోల్లంఘన విజృంభమాణాంభోనిధానఖర్వగర్వనిర్వాపణోద్దండార్దేందుకాండ, కాండగ్రీవావతారసాధారణమేధాసంవిధానప్రదాహృద్యానవద్య విద్యానుబోధితామేయవాచంయమవేదండ, దండ