పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

XV

ఇందలికథ :- “ఈ గ్రంథము కథాప్రారంభము మొదలుకొని వేంకటాచల పట్టణవర్ణనము. నలిబిలిగోపురాది వర్ణనము, స్వామిపుష్కరిణి వర్ణనము, బయకానికోన పాండుతీర్థాకాశగంగాదుల వర్ణనము, వేంకట శైల వర్ణనము, శ్రీవేంకటేశ్వరస్వామి వర్ణనమును, శ్రీవారి వాహ్యాళి వర్ణనము, తిరునాళ్ల మహోత్సవాది వర్ణనమును, మొదటి 58 పద్యములవఱకు వ్రాయబడి యున్నది. అది మొదలు సాయంతనవర్ణనాదులు, జాతివార్తలు, స్వామివారి యెదుట జరుగు సంగీతమేళముల వర్ణనములు, లోనగు వృత్తాంతములు 112 పద్యముల వఱకు వ్రాయఁబడియున్నవి అవ్వల శ్రీవారి కేలిడేగ ఆకాశ రాజచంద్రుని సుతయగు నాంచారుదేవి యుపవనమున వ్రాలుటయుఁ దోడ్తోన శ్రీవా రచ్చటికి మంత్రి సహితుండైఁ విచ్చేసి యవ్వెలంది యుదంత మరయుటకు మంత్రిం బంపఁగా, నతనివలన దానామె వృత్తాంతము విని యవ్వెలఁదినిఁ జూచి వర్ణించుటయుఁ, దర్వాత నాకాశరాజు మంత్రివలన వేంకటేశ్వర స్వామివారి యభిప్రాయ మెఱింగి తనసుతనిచ్చి వివాహంబొనర్చి స్వగృహమునకు నగ తనయయగు దన తనయను బంపునపుడు త్రోవలో స్వామివారికిని, నాగదత్తుఁడను చోరునకును యుద్ధము సంప్రాప్త మగుటయుఁ జోర వ్రజంబు స్వామి పుష్కరిణింబడి సారూప్యం బందుటయు, నష్టదిక్పాలకులు శ్రీ వేంకటేశ్వర స్వామిని స్తుతించుటలోనగు పద్యములచేఁ దక్కిన గ్రంథంబంతయు నొప్పుచున్న ది. ఈ గ్రంథమునందుఁ గథ విశేషముగ వ్రాయఁబడి యుండలేదు. అయినను తన నేర్పఱితనమును లోకమునకుఁ దెలుపుటకై కవియిది యొక వ్యాజము గల్పించుకొని యిట్టి లక్ష్య గ్రంథమును వ్రాసియున్నాఁడు” (పూ.రా).

నాగదత్తునికథ :- స్వామివారి కథకన్న పెద్దది, స్వారస్యమైనది. ఇతఁడు కందుకూరి రుద్రకవి యొక్క నిరంకుశునికి, తెనాలి రామకృష్ణయ్య నిగమశర్మకును అపరావతారము. ఏ మాత్రము మార్పులేదు. - తిరుపతి పురములో మాధవుఁడనెడు శోత్రియుఁడు సకలశాస్త్రవేది యుండెను. ఆతనికి బహు కాలమునకు గలిగిన పుణ్యపు పంట నాగదత్తుఁడు బాల్యములో చక్కగా చదివి, “తండ్రికన్నను నెఱవాది తనము మంచితనము గ్రామణితనము వర్తనముగలిగి... కీర్తనీయుఁడై " యుండెను. వివాహము కూడనైనది. కాని యింతలో 'ఆళ్వారు తీర్థము చెంతఁ గొంతకాలంబు' ... 'వీతాచారుఁడు దుర్మదాంధుఁ డగుచున్ వేశ్యాంగనావాటులన్ ... చేతోజాత వశం వశంవదుండయి జరించెన్'. 'దుర్విత్తి