Jump to content

పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/150

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విజయవిలాసము

101

    కురువేరు పెడవెట్టి మరువంపు దడిగట్టి
              ముంగిట కపురంపు మ్రుగ్గుబెట్టి
    గురుతర కౌశికా గురు ధూప ధూమము
              లిచ్చి సువాసన మెదుట నుంచి

గీ. మదనురతి యుక్తముగ మృగమదమునందుఁ
    జేసి తత్పీఠమున నిల్పి భాసురముగఁ
    జందనసుమాక్షతములఁ బూజలు ఘటించి
    బహువిధోపాయనమ్ములు వహి నొసంగి. 241

సీ. ధ్యానమాత్మభవున కావాహనము లోక
            చారి కాసనము ద్వక్స్థా యికర్ఘ్య
    మంబు దాపునకుఁ బాద్యము వార్ధిమన్మని
            కాచమనీయ మబ్జాంబకునకు
    స్నానంబు శంబరాసనునకు వస్త్రము
            ప్రకటాంబరతనుధారి కుపవీత
    మద్వజరాజు మేనలునకు సుగంధ
            మతిశీలగంధవాహరధి కక్ష

గీ. తముల విహత శౌర్యునకుఁ బుష్పము విరివిలు
    తునకు ధూపము సురభి మిత్రునకు దీప
    మల రవీంద్వక్షసుతునకు ఫలనివేద్య
    ము శుకబలునకుఁ దాంబూలము రతిపతికి. 242

గీ. అనుచు సకలోపచారంబు లర్థిఁజేసి
    మకరచిత్ర పతాకాయ మదకరాయ
    మత్త హంస గజేంద్రాయ మన్మథాయ
    మానినీమాన హరణాయతే నమోస్తు. 243

వ. అని వెండియు.

శా. జేజే యిక్షు శరాసనా శరణు రాజీవధ్వజా మ్రొక్కు భ
    ద్రాజీవేళకుమారకా వినుతి సారంగీ గుణా డెంకణల్
    రాజీవాదిశిలీముఖా భజనమో రాజాప్త కొల్వోశుకీ
    రాజాదండము దర్పకా ప్రణుతులో రామామనోహారకా. 244