ప్రబంధరాజ వేంకటేశ్వర
4సీ. ఛాగపు పొలదిండి సాహేబు తలమాని
కపు వినుకొమరు పొగడ్తవాఁడ
ననుమీను మనుమని నుడిపంట వ్రాయుమేల్
దంటగన్న తుపాసి బంటవాఁడ
మోదుగ నునుమొగ్గ ముక్క చక్కని పక్కి
నెక్కు నెక్కటి గేరు టెక్కువాఁడ
తపసిరా చందుడెందపు తమ్మి ముద్దియ
పయి నంగుగ మెలంగు మయిమవాఁడ
గీ. కోరి యనయంబు ప్రామిన్కు కొనలుదెల్ప
లేని వలకారి జిగిరూపుమేనివాఁడ
సొగసుకాటుకపేరి గొండగవిదారి
నోమినెక్కొన్న నలరూపు సామిమిన్న.
5సీ. బలితంపు వలపు దాల్పరిదిండిగమి ఠావు
గల దొరవాకిట నిలుచువాఁడ
చాగపు ననదోఁట సామింట జాలీను
బాలెంతయగు బొటవ్రేలివాఁడ
పాలేటిరాయని పాపనిసైఁదోడు
పెద్దకొల్విడు రొమ్ము గద్దెవాఁడ
బెడఁగు చెంబడిబిడ్డ కడుపున బొడమిన
జడదారి వడిసుడి నదరువాఁడ
గీ. వెల్లనుడి చుక్క తలగోము బొల్లిమోము
పక్కిరా మూపు నడిచక్కి నెక్కువాఁడ
సొగసుకాటుకపేరి గొండగవిదారి
నోమినెక్కొన్న నలరూపు సామిమిన్న.
అభేదరూపాలంకారము
సీ. కలఁచి సంద్రము బయల్ సెలసికొట్టిన కోఱ
తుద చుట్టికొను నాఁచు మొదలితాచు
చప్పరింపఁగ జాఱి చక్కఁగా సెలవిని
చిందు నురుగు బుగ్గ చందమామ