పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/130

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విజయవిలాసము

81

క. ఆసమయంబున నొకశుభ
   వాసరమున నంజనాద్రి వాస్తవ్యుం డు
   ద్భాసురతరచిత్రమృగ
   వ్యాసక్తి మనంబు విలసి తానందముగాన్. 178

సీ. మును చెవిబాయజాఱిన యోరసికను క
              సీదురుమాలు భాసిల్లగట్టి
    సరిలేని కట్టాణి చౌకట్లు ధరియించి
              కస్తూరికాతిలకంబు దిద్ది
    తలిరుచందురుగావి దట్టిగట్టిగజుట్టి
              వలవంక రతనంపు వంకిజెక్కి
    కుంకుమ రసమునఁ గూర్చుగంధ మలంది
              వలిపెదుప్పటి వలెవాటు వైచి

గీ. సకలభూషణమణిరుచినికర కిరణ
    రాజి గడుమించ నిజమందిరంబు వెడలి
    పొగడపుగుబ్బలి నడుమను వెడలునట్టి
    వనజబాంధవ వైఖరి వనర నపుడు. 179

జాతి


చ. గొరిజలయుబ్బు మేనిజిగి గొప్పయురంబు వెడందపంచకం
   బెఱుపగు వన్నెచిన్ని చెవు లెక్కువమై సిరసెత్తు మెట్టువాల్
   కొరసగిలింతగట్టి మఱి కొంచెము కండము కాళ్లవేగమున్
   మెఱుఁగుఁగనుల్ సుదేవమణి మెత్తని రోమము లొప్పమెప్పుగన్. 180

సీ. తగినట్టి మాష్టీని దండపోల్కిమెఱుంగు
             మెఱయుకైవడి బిసమీటినగతి
    కీల్బొమ్మతెఱఁగున గిణిబెళ్కు చాట్పున
             లకుముకిపోలిక లాగుసారె
    ద్రిమ్మరు మేర రసంబు కదలుమాడ్కి
             నీట మునిఁగి లేచు సూటిత్రాటి
    బాణవితాన పటము విడచినయట్లు
             రిక్కతెగిపడిన రీతి మింట