పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/129

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

80

ప్రబంధరాజవేంకటేశ్వర

అపూర్వప్రయోగము


సీ. బాసఁదప్పక బూమి రాసబాపని కిచ్చి
             నిజము సేకొన్న మన్నీనికతలు
   నలకిపుట్టువు గ్రోలనరచేతను గలాని
             చిలుకుముక్కున నిల్పు బలియుకతలు
   కంపటీలను పసిగాపరులకు గొండ
             వేలనెత్తిన గొల్లబాలుకతలు
   నలుమాఱుమనువుబిడ్డల బిడ్డలాటకై
             నేలకు జేయు కయ్యాలకతలు

గీ. కులముపెద్దల రచ్చల గుంపుగూడి
   చేరగావచ్చి కోయితల్ జెప్పుకొనఁగ
   సకలమును విన్నవారము సామి మమ్ము
   నేళముగ సూసి సిత్తాన నెంచకయ్య. 174

చ. అనవుడు వానివాక్యముల కయ్యెడ మిక్కిలి సంతసించి నె
    మ్మనమున నుగ్రవన్య మృగమండలి హింసవిలాసధర్మమౌ
    నని పరికించి వారికిఁ బ్రియంబునఁ గట్నము లిచ్చి దూతలన్
    బనిచి దిగంతశైల వన పక్కణభూముల కాక్షణంబునన్. 175

క. కమ్మలు కైరాతకకుల
   కమ్ముల రమ్మనుచుఁ గౌతు కమ్మలరారన్
   సమ్మతి బనిచిన నొకదివ
   సమ్మతి గడవక విదమకు సమ్మతిగాఁగన్. 176 176

అపూర్వప్రయోగము


క. అయ్యెడ నడవిని నొండొరు
   కుయ్యిడి పిలుచుచును లుబ్ధకులు హరిపనుపుల్
   సెయ్యుచు గనుగొని బాగెము
   నెయ్యంబున మనకు గల్గెనే యని చేరన్. 177