70
ప్రబంధరాజవేంకటేశ్వర
విప్పు జబ్బలకాళ్ళు వ్రేల్మట్టు తోకలు
గురువర్తులాండముల్ కొద్ది చెవులు
బలుపెనగూడిన మెలిగట్టు కొమ్ముల
తలలును మదము చెంపలు మొదలగు
గీ. నంగములు గల్గి వారిజపాకు లులువ
తొక్కుమిరియా లుమెతకాయ మెక్కిసెలఁగి
కుఱుచనిది సన్నలుబడ డీకొని తమి నెదు
టి దగరులఁగెల్చు గురుబపొట్టేళ్ళజోళ్ళు. 133
జాతి
తే. మేను తల తోక కాళ్ళు పల్ మించు గలిగి
రెట్టమెడనెత్తి తొడప్రక్క పొట్టపెంచ
మఱచికాటున విడువక తఱమిగెల్చు
దొడ్డపికిలిపిట్టల బిరుదుకురుజులును. 134
సీ. గందపుమ్రాఁకులు గపురంబుటనఁటు లె
న్గుతలముత్తెములు జేగురు చిలుకలు
గోరంకిదిమ్ము కస్తూరిమెకమ్ములు
వెదురుబియ్యము కొండవెలఁగపండ్లు
చాఱపప్పు సితఖర్జూరముల్ ద్రాక్షలు
తేనెకావళ్ళు రాతిబదనికెలు
నెమ్మిపురులు నక్కకొమ్ములు తలముళ్ళు
పారుటాకులు మణులౌ కేరిజములు
గీ. గసగసలు వీకవిఁడ్లు సోగ చిలుకలును
సింగములు పులిపిల్లలు జింకలేదు
గములు మానిసికోతులు కాఱుపోఁతు
లేడికదుపులు పులిజున్ను పాడిపసులు. 135
మ. సెలవిం డ్లేనుఁగుదంతముల్ పికిలిపూచెండ్లున్ బునుంగిఱ్ఱిమై
యొలపున్ గస్తురి కప్పురంబు పులతోళ్ళొడ్డిలు జవ్వాది సి