పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/109

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

60

ప్రబంధరాజవేంకటేశ్వర


గీ. ఛత్రకత్ర జౌధారణి ఝంకె సరళి
   పాటసైసిక యుప ఝంకె మీటుకంపి
   తాహతంబులు హుళియుఁ బత్యాహతమును
   స్ఫురితములు వాద్యము లనయ సరణి మీఱి. 100

చ. సొలపుగ నిర్వదైదు విడిచూపులు నాల్గుమొగంబు త్రిప్పుతీ
    డలవడ బొమ్మసన్న లొక యర్వదినాలుగుహస్త చేష్టలున్
    వలనుగ కేకిహంసవృష వారణ కేసరి శుద్ధ సంగతుల్
    వెలయుచు ముట్ట నేర్చిసరిలేమలలో బిరుదంది పొందకన్. 101

సీ. తనమ్రోల డిండిమధ్వనిమ్రోయ నలుగడ
             బెళుకుచూపుల భుజంగులను గాదఁ
    గులుకు నెన్నడల రాగిలుకుటందెలసద్దు
             నటుల కాదిమతాపటిమఁ జూపఁ
    జెలులకు నర్మోక్తిఁ దెలుపుచు చేయు కేల్
             కదలిక తచ్చాస్త్రగరిమ నెఱప
    నీటుసింగారపు నెమ్మేనిమై సరి
             విరివింటి దొరనైన మరులుకొలుపఁ
గీ. బట్టుచాలని ఱవిక చన్గట్టుదెగడు
    బిగువు సిబ్బెపుగుబ్బచన్నుఁగవ యుబికి
    పైఁటజార్పఁగ నుడిగపుఁబడతి దిద్ద
    మురువుగ నెసంగె నొకజగన్మోహనాంగి. 102

క. బురుసాకాశరువారపు
    నెఱికలు కొనఁగోరఁ దీర్చి నీలాంబుదభా
    సురచంచల యనఁ దనరుచుఁ
    దెరలోన న్నర్తనాధిదేవత లీలన్.103
   
వ. నిలిచిన

సీ. మునుమున్ను భువనమోహనరంగమర్దళ
              ధీరస్వరమ్ముల ధిమ్ము మనియె
    నావెంబడిగను గాయనగాయనీమణి
              గానమ్ము ఘమ్మున గ్రమ్ముకొనియె
    నావెంటనె విచిత్ర యవనికాగ్ర వసంత
              కుసుమముల్ ఝల్లన ముసురు చూపె
    నావెనుక నటిపదాంగుష్ఠ విన్యాస
              మునగజ్జియలు ఘల్లుమనుచు మ్రోసె