పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

33

నారవయేట దుర్మతిసంవత్సరంబున కృష్ణార్జునసంగరంబును 3 , ఇరుబదవయేటఁ గ్రోధస సంవత్సరంబున గొల్లపల్లి రఘునాథశతకంబును 4 , ఇరువదియొకయేట నక్షయయందు పంచనృసింహక్షేత్ర మాహాత్మ్యంబును 5 , ఇరుబది రెండవయేట ప్రభవసంవత్సరంబున సారసంగ్రహ గణితంబును 6, రచియించితిఁ బిమ్మట ముప్పది వత్సరంబులు రాజ విద్యావ్యాసంగంబు గలిగి మండల న్యాయవాదినై వ్యవహారభారంబునంజేసి కృతికల్ప నంబున కవకాశంబు సాలకయుంటి నట్లుండియు నొకప్పుడు లక్షణావిలాసంబును 7 , ధాతృవత్సరాంతమున రచియించితిం బిదప స్వభానుసంవత్సరం దాదిగా దుర్ముఖివత్స రాంతంబు వట్టు అభినవగద్య ప్రబంధంబును 8 , అభినవకౌముదియు,9. వైశ్యధర్మ దీపికయు 10, శ్రాద్ధసంశయవిచ్చేదియు 11 , ప్రాయశ్చిత్త నిర్ణయంబును 12 , సంస్కృతంబునం గామాక్షి శతకంబును 13, ఆచారనిరుక్తియు 14 , దురాచారపిశాచ భంజనియు 15, చక్కట్లదండయు16 , తెలుగునాడును 17 , తర్కకౌముదియు 18, విగ్రహారాధన తారావళియు 19 , దీనితో చేరిన మనోలక్ష్మీవిలాస నాటికయు 20 , సూర్యశతకంబును 21, నౌకాయానంబును 22, చిలుకలకొలికి శతకంబును 23, , ముద్దులగుమ్మ శతకంబును24 , సీతాకల్యాణ నాటకంబును 25 , నమస్కారవిధి దీపికయు 26 , రచియించితి నంత గొన్ని దినంబులు వ్యవహారంబునుండి విశ్రాంతి గైకొని హేవిళంబి మొదలు శాకుంతల నాటకమును 27 , రత్నావళి నాటికయు 28 , ముద్రారాక్షస నాటకంటును 29 , మహావీరచరిత్ర నాటకంబును 30, మాలతీమూధవీయ ప్రకరణంబును 31 , ఉత్తరరామచరిత్ర నాటికయు 32, మంజరీ మధుకరీయ నాటికయు 33 , కురంగ గౌరీ శంకర నాటికయు 34 , నను పుస్తకంబులు రచించితి నిట్లు ముప్పదినాల్గు ప్రత్యేక గ్రంథములు సేసి కారణాంతరవశంబున దైవ ప్రేరితుండ నై శ్రీదేవీభాగవతంబు దెలిఁగింపఁ బూని

-:షష్ఠ్యంతములు :-

క. వృషసాదికి విషఖాదికి | సుషమాపాదికిని భాను•సుతమదసర్వం
   కషవిచ్చేదికి విద్యా విషయ వినోదికి శిరః ప్రభృతసురనదికిన్

క. సద్యోగమహోద్యోగల , సద్యోగయమాద్యఖండ • సంపన్మునిరా
   డ్విద్యాగతముద్యోగప | దద్యోతికపర్దఘృణికి • దైవాగ్రణికిన్ ||

క. స్థిరయశునకుఁ గరుణారస | పరవశునకు గిరీశునకునుఁ • బరమేశునకున్
   గిరిజా ప్రాణేశున కం|బర కేశునకున్ వినతసుపర్వేశునకున్ ||