పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వి తీ య స్కం ధ ము.

115


క. మనమునఁ గోపింపకు నేఁ | బనివినియెద ననుచు సమయఫక్కినిఁ జనఁగా
   మనుజేశుఁడు దుఃఖితుఁడయి | చని రాజ్యము సేయుచుండె జగము పొగడఁగన్.109

ఆ.వె. అంతఁ గొంతకాల మరుగంగ నొకనాడు ! పేటతమక మాత్మ వేగిరింప
   విబుధనది తటమున విపినంబులోఁ జేరి | స్తోకజలను గంగ జూచి యపుడు.110

క. వింతపడియుండఁగా నా చెంతను శరములుసు విల్లు చేఁబూని పటు
   స్వాంతుఁడయి యాడు నొక ధీమంతునిఁ గని కొడుకటంచు మది నెఱుఁగ కొగిన్.111

ఆ.వె. ఓమహాకుమార యో మన్మథాకార | శరాశరాసనప్రచారధీర
   చిన్నబిడ్డ నిన్ను గన్నవా రెవ్వరో | తెలుపుమయ్య, ప్రీతిఁ గొలుపుమయ్య.112

వ. అనిన విని యబ్బాలుండేమియు బలుకక శరాశరాసనంబు లచ్చటన విడిచి సాంద్ర
తర వృక్షపఙ్త్కివలన మరగి చనియె నంత రాజును మిగుల చింతాక్రాంతుడై
యుండం జూచి దివ్యనది తొల్లింటి మానుషవేషంబున జనపాలు నెదుటం బడినం
జూచి గంగయని యెఱింగి ఈబిడ్డఁ డెవం డిక్కడనుండఁ గతంబేమి యని యడిగిస
గంగాదేవి యిట్లనియె.113
 
క. ఈబిడ్డడు నీబిడ్డడు | నేఁ బట్టిననాడు పుట్టె నేనీతని గా
   రాబమునఁ బెంచితిని విద్యాబుద్ధులు వీని కొదవె నార్యులవలనన్.114

క. నీ సుతునిం గొనిపొమ్ము, మహాసుఖముననుండు మింక ననిపల్కఁగ నా
   రాసుతుఁడు హస్తిపురికిం ! జేసె బ్రయాణంబు సుతుని జేకొని కడఁకన్.115

చ. గజపురికేగి శంతనుడు కార్యమెఱింగి ధరాసురోత్తమ
   వ్రజమును బిల్వనంపి శుభవాసరలగ్నము లొప్పఁ జూచి భూ
   ప్రజలు నుతింప దివ్యనదిపాపని కిచ్చెను యౌవరాజ్యమున్
   గజిబిజి లేక యేలెను జగంబును ధర్మముఁ దప్ప కెంతయున్.116
 
వ. అని చెప్పి మఱియు సూతుండు మునులారా ! గాంగేయోత్పత్తియు గంగావతరణం
    బును వసుసంభవంబును వ్యాసునివలన విన్న తెఱంగున మీకు వివరించితినని చెప్పిన విని
    శౌనకాదులు సూతుంగాంచి, యయ్యా మావేడినకొలంది నెల్లయుదంతంబులు
    సవిస్తరంబుగా నానతిచ్చితిరి. యోజనగంధి శంతనున కెట్లు ప్రాప్తించెనో వినవలఁతు
    మనిన సూతుం డిట్లనియె.117

-: సత్యవతీ శంతను సంవాదము. :-


ఉ. ధర్మపరుండు శంతనుఁడు దా మృగయార్థ మరణ్యభూమికిన్
    దుర్మద భల్లుకేభకిటి ధూనన కృత్యమునం బ్రజావళీ