పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తొలిపలుకు

  ఆంధ్రగీర్వాణములందు అలంకారశాస్త్ర గ్రంధములు, వ్యాకరణములు అనేకములున్నవి గాని వాజ్మయ చరిత్రలు, కవిజీవితములు మన సాంప్రదాయమునకు గ్రొత్తవి. ఆంధ్రమున నిట్టి కృతులకు శ్రీ గురజాడ శ్రీరామ మూర్తి పంతులుగారును, శ్రీ కందుకూరి వీరేశలింగము పంతులుగారును మార్గదర్శకులు, వీరొనర్చిన బాషా సేవ అగణ్యము. అయినను వారి యుద్యమము అపూర్వమగుటచేతను, దత్కాలమున లభ్యమైన సామగ్రి అధికము గాకపోవుటజేతను, వారి కవిజీవితములు అసంపూర్ణములును, అసమగ్రము లునై యున్నవి. చరిత్రకు బరిశోధన ఆధారము. పరి శోధనలవలన దినదినము క్రొత్తవిషయములు విదితమ లగుచుండును. అట్టివిషయము లన్నింటిని జేర్చి వ్రాసిన చరిత్రలే సార్ధకములగును. నన్నయభట్టు జీవితము ఒకరిద్దరు వ్రాసిరిగదా, మరల నింకొకరెందుకు వ్రాయవలెనని యాక్షేపించుట అసమంజసము. షెల్లీ అను ఆంగ్లేయ కవిజీవితము ఎందరోవ్రాసియున్నను మొన్నటి దినము మరల నింకొగ్రంధము ప్రకటింపబడినది. 150 సంవత్సరములకు బూర్వము జీవించిన షెల్లీని గురించియే నూత్నాంశములు పరిశోధనవలన బయల్పడుచున్నప్పుడు ఇక పురాతనమైన ఆంధ్ర కవ్లమాట చెప్పవలెనా!
   శ్రీ చాగంటి శేషయ్యగారు ఇంతవరకు లభించిన విజ్ఞానము నుపయొగించుకొని ఆంధ్రకవి జీవితములను వ్రాయదొడగినది కొనియాడదగిన కార్యము. వీరి యుద్యమము ఎంత శ్లాఘనీయమో ఒక్కసంగతి చెప్పినను దెలియగలదు. ఇంతవరకు బ్రకటింపబడిన కవిజీవితములన్నింటిని గలిపినను, మొత్తముకవులసంఖ్య మూడువందల