పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

رق “ఆంధ్రకవితరంగిణి" ప్రథమసంపుటము 1947 వ సంవత్సరమునఁ బ్రచురించితిని. ఆంధ్ర ప్రజానీకము చూపిన ఆదరాభిమానములచే నేటికి పండ్ర్తెండు సఁపుటములు ప్రకటింపఁ గలితిని. ఇంకను పదు మూఁడు సంపుట ములు ముద్రణము నందవలసి యున్నవి

ఈ మొదటి సంపుటమునకు ద్వితీయ ముద్రణను ఒనర్చు ఆవ కాశము కలిగి నందుల కెంతయు సంతసించుచున్నాఁడను, నాయొక యొునర్చిన కృషికి ఆద్రపాఠక మహాశయులు చూపిన మెప్పదలయే యీయవ కాశమునకు హేతు వు. ద్వితీయ ముద్రణమున గ్రంథములో మార్పు లేవియు లేవు, ఇందు ఆయా పట్టుల నేనువేసిన నిర్ణయయులకు అన్యధాత్వము కల్పించు ప్రబలచారిత్రక సాక్షములు ఇటీవలి పరిశోధనలలో బయలుపడకుండుటచే గ్రంథమున్నది ఉన్నట్లుగనే ముద్రించితిని.

కవి జీవిత చరిత్రతో బాటు కావ్యవిమర్శయు నుండుట మేలను మతమును గూర్చి ఎడనెడ మనవి చేసికొనియే యుంటివి, మన యుత్తమ కావ్యములను గూర్సిన సమగ్ర విమర్శగ్రంథము "వెలువడుట అత్యావ శ్యకము. ఆట్టి గంథమును వెలువఱచుట కెంతేని కుతూహలము కలవాఁడనయ్యు, విద్వాసుల సాహాయ్యము లభించునను విశ్వాస ముండియు, గ్రంథ ముద్రణమునకగు వ్యయప్రయాసలను తలపోసి వెను కంజ వేయుచున్నాఁడను. ఇప్పటి పరిస్థితులలో గ్రంథ ముద్రణభారము వహించుట ఎంతకష్టసాధ్యమో ఆనుభవజ్ఞలగు రచయితలకు నేను వేఱు గా మనవి చేయనక్కఱలేదు. ఊదార హృదయులగు ఆంధ్రభాషా భిమానుల ప్రోత్సాహము ఇతోధికముగా లభించునెడల •నాప్రయత్నము నెరవేరఁగలదనియు నాకు దృఢవిశ్వాసము లేకపోలేదు.