పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కొ జి డె న చో డ శా , ఇతవఱకు వాసినదానినిబట్టి ద్రావిడి చోళులలో గాని యాంద్ర చోడులలో' బెలనాఁటి, రేనాఁటి పొ_త్తపినాఁటి చోళశాఖలలోఁగాని నన్నెచోడఁడులేడని తేలినది, ఇఁకమనకు మిగిలినదికొణిదెనచోడ శాఖ ఈ శాఖవారు ప్రస్తుతము గుంటూరు మండలములో నరసారావుపేటకు సమిూపముగా నున్న కొణిదెనను రాజధానిగా చేసికొనిపాకనాటిలోని కొంత ప్రదేశమును కమ్మవాఁటిని బరిపాలించుచు వచ్చిరి, అందుచే వీరిని, కొణిదెన చోడులని పిలచుచున్నారు. ఈ కొణిదెననుబూర్వము కొట్యదొనయని పిలుచుచుండెడివారు, ఈ శాఖ ద్రావిడచోడులనుండి విడిపోయివచ్చినదో శాడో విడిపోయినచో నెప్పటినుండి విడిపోయిదో చేప్ప(జాలము, కాని వీరు తమ శాసనములలోఁ గరికాలచోడుని సంతతివారమని చెప్పకొనుచువచ్చిరి. ఈశాఖఆంద్రచోళుల తెగకు చెందినదేకాని, వెలనాఁటి రేనాఁటి శాఖలకం ర్చె భిన్నమయిన శాఖ, వీరికి ప్రత్యేక ప్రశస్తికలదు. వీరిలో కొందఱు శాసనములలో దమకు పొత్తపిచోళశబ్దమునుగూడ జేర్పుకొనుచు వచ్చిరి. ఆందుచే వీరిని పొత్తపిచోళులలోనుడిచీలిన యొక శాఖయని చెప్పవలసియున్నది, ఈ కొట్యదొనచోడుల ప్రశస్త్రీ, యిది:- "స్వస్తిచరణ సరోరుహ విహిత విలోచన త్రిలోచన ప్రముఖాఖిల పృధ్వీశ్వర కారిత కావేరీశ్రీరకరి కాల కుల త్న ప్రతీపాహీతకుమారాంకుశ" ఇక్యౌది. ఈ కొణిదెనచోడులలో నాలుగై దంతశ్శాఖ లున్నవి. నాకు లభ్యమైనంతవఱకాశాఖల వంశవృకముల నీదిగువ నిచుృచున్నాఁడను.