పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/188

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

న న్ని చో డఁ డు 715 జయింపఁ బడిన త్రి లోచనుడును ఒక్కఁడే యైన యెడల, గరికాలచోడుని కాల మాఱవ శతాబ్ది యనుమాట సత్యమగును, ఆయినను ప్రమా ణాంతరము లభించినఁగాని యిది సత్యమని చెప్పజాలము. కొందఱు చరిత్రకారు లీతిలోచన పల్లవుని యునికిని గూర్సియే సంశయము చూపుచున్నారు. దావిడ చోళుల పట్టికను బై విచ్చియున్నాడను. ఆపట్టికలో చోడ బల్లి గాని నన్నెచోడుఁడు గాని లేఁడు, పైని జెప్పిన పట్టిక లో నున్న మొదటి పరాంతకునకు మధిర కొండై యను బిరుదుకలదు. మధురను జయించిన వాఁడని దానియర్ధము. కొన్ని శాసనములలో నీబిరుదము “మథురాంతక' యని యుపయోగింపఁ బడినది. ఆతని తరువాత రాజ్యమునకు వచ్చినవారు మధురను తవుయేులుబడిలో నుంచు కొనఁ గలిగినను లేకున్నను నీచోళ పభువు లందఱును తమబిరుదము లలో నీ మధుగాంతక బిరుదమును తఱచుగాఁ జేర్చుకొనుచు వచ్చిరి. పైనిజూపిన పట్టికలోఁ జెప్పబడిన దావిడచోళుల వంశములో నుండి యొకశాఖ చీలిపోయి, కడపమండలము నందున్న 'పొత్తపి" యను పట్టణమును రాజధానిగాఁ జేసికొని తత్పరిసర పాంతమునకు, బభువు లై రాజ్యము చేయుచు వచ్చిరి. వీరు తమ పూర్వవృత్తాంతమును దెలుపు మధురాంతక శబ్దమును జేర్చి కొని మధురాంతక పొత్తపి చోళు లని వ్యవహరించుకొనుచు వచ్చిరి. వీరిశాసనములు శాలివాహన శకము ౧౧ం ం మెదలు ౧.9Xం వఱకును గనఁబడుచున్నవి. ఈ శాసనములు కడప నెల్లూరు మండలములలోఁ గానవచ్చుటచే వీరా పాంతములను బరిపాలించిన ట్లూహింపఁ దగియున్నది. లభించినంత వఱకు వీరి వంశావళిని తిక్కనసోమయాజి చారితమున నిచ్చు చున్నాఁడను, ఆవంశములో చోడ బల్లి, నన్నెచోడ నామ ధార్వలెవ