పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/16

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

యున్నారు. కాని వారి యూహయందు సత్యమున్నదని నాకుఁ దోచఁ లేదు, రాజరాజు నాస్థానమున నన్ని య-నన్నయ నామ ధారు లిరువు రుండినట్లు వేఱుసాక్యము వలన ఋజువయిన నేకాని, రామారావు గారి యభిపాయములో నేకీభవింపఁజాలను. శాసనమునందు నన్నయభట్టు తనను గూర్చి యేమియుఁ జెప్పకొనకుండుటయును నారాయణభట్టున క గహారమిచ్చిన రాజరాజు నన్న యను సత్కరింపకపోవుటయును, నందంపూడి శాసన కావ్యకర్తయు, మహశీ భారతక_ర్తయు నొక్కఁడు గాఁ డని చెప్పటకుఁ గారణములని శ్రీరామారావుగారు వ్రాసియున్నారు. కాని యీ కారణములనుబట్టి యిరాభిన్న క_ృత్వము ధ్రువపడఁజాలదని నా యుద్దేశము. శాసన కావ్యకర్తలు తమను గూర్చి శాసనముల యందు జెప్పకొను నాడాగము గన్పట్టదు. శ్రీనాథుఁడు తానుగ్రంథకర్త నని శాసనములలోఁ జెప్పకొనలేదు. శాసన కావ్యక_ర్తలు తమను గూర్సి విశేష వుగాఁ జెప్ప కొనిన శాసనములు నేఁజూచినంతవesకు లేవు. చారిత కారలందఱును నన్నియ నన్నయలు భిన్న వ్యక్తులు కారిని నిర్ణ యించియున్నారు. బలవత్తమమయిన సాక్యము లభించినఁ7గాని భిన్నత్వ మంగీకార్యము కాదు.

నన్నయవంశము

పంచమ వేదమని ప్రశస్తిఁ గాంచిన శ్రీమహాభారతాంద్రీకరణము నకుఁ బూనుకొనిన యివ్మహాకవి బ్రాహ్మణుఁడు, ఆపస్తంబ సూత్రుఁడు, యుద్గల గోతుడు. ఇతడు తన తల్లిదండ్రుల పేగులను గాని తన పూర్వ ల యుదంతావును గాని జెప్పకొనియుండ లేదు, నిరాడంబర జీవనులగు మహా పురుషులు కేవలలోకోపకార తత్పరులై ఘన కార్యములను జేయు చుందురు. వారికి యశః కాంక యుండదు. నన్నయభట్టాతరగతికిఁ జెందినవాఁడు. తనను గూర్చి యిరాకింది పక్యమును మాత్రమెవరో చెప్పినట్లు కృత్యాదిని రచించియున్నాడు, నిజముగా నీపద్యము “ਚੋਂ రాయణభట్టయిన రచియించియుండెనేమో యని యనిపించును.