పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

 ఈ రెండశాసనములును భారతకృతిపతియైన రాజరాజు బ్రాహ్ర ణుల కగ్రహారములిచ్చి వాయించినవి. ఈ శాసనవులను భారత శావ్యక_ర్తయే రచించినాఁడని చెప్పట యు_క్తము. శాసనములను రా జులు తేను యూస్థానపండితులచేత నే వాయించుచుందురు, వేమ భూపాలుని యాస్థానకవియైన శ్రీనాథభట్టనేక శాసనములను రచియి 0చి యుండెను. విశ్వేశ్వరభూపతి యాస్థానవిద్వాంసుఁడగు విన్న కోట పెద్దన, విశ్వేశ్వరి రాజ శాసనమును వాసియుండెనని విదితమయినది. ఇట్టి యు దాహరణముల నింకను జూపవచ్చును. శిలాశాసనములలో లిఖింపఁబడియుగాడుటచే నీకవి యొక్క నిజనామిము నన్నియ యే యో యుండ నని మనమూహింవఁదగియున్నది. ' న న్ని ' శబ్దము కర్ణాటక భాషలోనిదనియు, దానికి "సుందరము లేక పియము" అను నమున్న దనియు, బండితులభిపాయమిచ్చి యున్నారు. నందంపూడి శాసన వులో నారాయణభట్టును 'నన్ని నారాయణాయ" అని వాడియు న్నా ( డు. ఈ కవి నామము నన్నియయేమైనను, నది యాంధ్రభాషలో నించుక మార్పఁ జెంది నన్నయ యని వాడబడుచు వచ్చినది. భారత వుండలి గద్య పద్యాదులలో (గూడ నీ మార్పు చేయఁబడిన బ్లాహింపఁ దగియున్నది. నన్నిచోడక విని, “నన్నచోడుc" డని “నన్నెచోడుc" డని పిలుచుచున్నారు. సూర్యరాయాంధ్ర నిఘంటుకర్తలు ప్రాచీన శాసనములలో నామాంతరములయందు వచ్చెడి "ఆయకు" బదులుగా “ఇయ" అని వాడుచువచ్చిరని వ్రాసియున్నారు. ఏది యెట్టున్నను నిది వాడుకలో వచ్చిన మార్పు దక్క నన్యము కాదు. ఆ కాలములో నీపేరు, నన్నియ యనియో లేక నన్నయయనియో ఏదియో యొక్క రూపములోనే యుండును. "కాని కొందఱు నన్నియయ నిగను ఁ గొందఱు నన్నయ యనియు ( బండితులు వాడి యుండరు. ఆందుచే నన్నియ నన్నయ లొక్కరే కాని భిన్నులు కారు.

నందంపూడి శాసన కావ్యకర్త నన్నియభట్టనియు, మహాభారత కావ్యకర్త నన్నయభట్టనియు, వీరిరువురును భిన్న వ్యక్తులనియు శ్రీమారేమండ రామారావుగారు భారతి (వృష. కార్తికము) లో వ్రాసి