పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2 ఆంధ్ర కవితరంగిణి

ఈ పద్యమున గవి శతక రచనాకాలము నిచ్చియున్నాఁడు. శాలివాహన శఖము 1164 కు సరియగు శుభకృతు సంవత్సరమున నీతండీశతకమును చచించెను. ఈ కాలము క్రీ. శ.1242 అయినది. దీనినిబట్టి యీతడు తిక్కనసోమయాజి కించుక పూర్వు డగు చున్నాడు, గంథ రచనా కాలమును దెలిపిన కవులలో నీతఁడు మొదటి వాడు. మీూక్రింది పద్యములోఁగవి చెప్పినట్టు

శా. థాత్రి ంభక్త జనానుకంజనముగాఁ దత్త్వ ప్రకాశంబుగా చిత్రార్థాంచిత శబ్దబంధురముగా సేవ్యంబుగా సజ్జన శ్రోత్రానందముగా శుబాంచిముగా శోధించి సర్వేశ్వర స్తోత్రం బన్నయ చెప్పె నిజ్జగములో శోభిల్లసర్వేశ్వరా! ౧33

ఈపద్యమును బట్టి యీతనికి 'అన్నయ యని నామూంతర మున్నట్లు తెలియు చున్నది.

ఈ శతకమున 142 పద్యములుండుటకుఁ గారణ మే వెూ "తెలియదు. శతకమను పేరుతో రెండు నూఱులు, మూడునూరులు పద్యములుగల శతకములు కలవుగాని, 142 పద్యములుగల శతకములు లేవు. తక్కి-నవికొన్ని లభ్యముకాలేదో లేక కవి 142 పద్యములు వ్రాసియుండగా, మఱికొన్ని పద్యముల నెవ్వరైన రచించి యందుఁ జేర్చిలో తెలియదు.

ఆంధ్రసాహిత్యపరిషత్తువారీ శతకమును బ్ర క టిం చి పీఠిక యందుఁ గవి చారిత్రమును వ్రాసియున్నారు. ఆ భాగము సీక్రిందఁ బొందుపఱచుచున్పాడను. "ఈ కవి వీర శైవుడు. కవినిగురించియు శతకరచనమును గుఱించియు పల్నాడు (గురజాల) తాలూకాలోని చెర్లగుడిపాడు