పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీరామచంద్ర ఆంధ్రకవితరంగిణి 21. యథావాక్కుల అన్నమయ్య

ఈతడు “సర్వేశ్వనా" యనుమకుటముతో 142 మత్తేభ శార్దూల వృత్తములు గల సర్వేశ్వర శతకమును రచించెను. ఈతని నామ మి-క్రిందిశతకాంతపద్యమువలనఁ దెలియుఁచున్నది.

</poem> మ. జయశక్తి నవిచంద్ర తారకముగాఁ జల్పెన్ యథావాక్కులా న్వయసంజాతుఁడు నన్నమార్యుఁ డవనివర్నించి నీ సత్కథా- క్రియసంబోధన నీదుభక్తిని మహానిత విశ్రాంతిగా భయవిభ్రాంతులు లేక యీశతకముం బ్రఖ్యాతి సర్వేశ్వరా.</poem> ! ఈ కవి తనగురువు దూదికొండ సోమేశ్వనాధ్యులని యీ క్రింది పద్యములోఁ జెస్పియున్నాఁడు.

 వు. అభిరమ్యంబుగ దూదికొండ మహనీయారాధ్యసోమేశ్వర
ప్రభుకారుణ్యవసంతసంజనిత (మత్పద్య) మద్వాక్యప్రసూనావళి
న్విభవం బొప్పఁగ గూర్చి యెంతయు లసద్విఖ్యాతిసంపత్సుఖ
ప్రభవం బై నభవత్పదద్వయము నారాధింతుసర్వేశ్వరా!<poem>

131

దూది కొండ యనుగ్రామము కర్నూలు మండలమున బ్రత్తి కొండ తాలూకాలోఁ గలదు. ఈగ్రామమును బట్టి యి-గురువు గృహ నామ మేర్పడియుండును. ఈతని నివాసముకూడ నాప్రాంతమే కావ చ్చును. అన్నమయ్య శ్రీశైలయాత్రకుఁ బోయినప్ప డీ సోమేశ్వరా రాధ్యుని గురువుగాఁ గై కొని యం డె నే వెూ!

 శా. శాకాబ్దంబులు వార్ధిషట్క-పురజిత్సంఖ్యం బ్రవర్తింప సు శ్లోకానందకరంబుగా మహిమతో శోభిల్ల సర్వేశ్వర
ప్రాకామ్యస్తవ మొప్పఁ జెప్పె శుభకృత్ర్పవ్యక్ష వర్షంబునన్
శ్రీకంఠార్పితమై వసుంధర పంుం జెన్నొoద సర్వేశ్వరా!

130