పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

68 е оt: в е рол в పూర్వఁడని తలంప నగుచున్నది. లేదా యూతనితో సమకాలికుఁ డగును. తిన్కనసోమయాజి భారతము మూలమున నే యధర్వణ భారతము మూలఁబడిపోయి యుండును. అట్లుగాక తిక్కనసోమయాజి భారతమును రచించుచున్నాఁ డని"తెలియక విరాటపర్వాదిగా మూఁడు పర్వములను రచించి యూరి పిమ్మట తిక్కన భారతమును చేయుచుండె ననివిని యధర్వణుఁడు తన భారతము నాపి వేసియుండె నని తలంచుటకుఁగూడ నవకాశ మున్నది. లేదా మూడు పర్వములను రచించునప్పటి "కాతని కాయువు సరిపోయియుండునని తలంచినను దలంపవచ్చును. gέβς డారణ్యపర్వ శేషమును బూరింపకుండ విరాటప ర్వాదిగా రచియించు టకుఁ గారణము తిక్క_నకు వలెనే తనరచనము నారణ్యపర్వమధ్యము నుండి ప్రారంభించుట కిష్టము లేక పోవుటయే యైయుండును. నన్నయ భట్టు మూఁడుపర్వములను బూర్తిగ రచియించె ననెడి వాదమున కధర్వణాచార్యుడు విరాటపర్వమును బారంభించియుండుట STంత బలము నిచ్చుచున్న దనుమాట సత్యమేకాని యితర కారణములను బట్టి యది సళ్యమని 窓)奇|్చయింపలేము. విరాటపర్వము మొదలుగా భాగ్రతమున మూఁడుపక్వనులను రచియించుటనుబట్టి యధర్వణాచార్యుడు తిక్క_న కించుక పూర్వఁడో సమకాలికుడో యై యుండునని యీతని కాలమును నిర్ణయింపఁ గలుగుచున్నాము. అంతకంటె యిత డెప్పటివాడో సరిగా నిర్ణ యించుట కిత్సరాధారములు లేవు. ఎజ్ఞా పెగ్గడకుఁ దరు నాతివాఁ డన లేము. తిక్కనసోమయాజికిఁ జాలతరువాతివాడై భారతమును తిక్కన రచింుంచిరయున్న ను దాను ముఱల రచియింపవలయు నను కుతూహలముగలవాఁడైనచో నాతడు భారతము మొదటినుండియుఁ జేయఁబ్రయత్నించును గాని విరాటపర్వాదిగాఁ జేయఁ బ్రయత్నిం పఁడు. కావున నితనికాలము క్రీ. శ. ౧.9:1ం ప్రాంత ముని తలంప