పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

214

ఆంధ్రకవి తరంగిణి

యను నక్షరము పొరబాటున వ్రాసియున్నచో నిది యర్థశూన్య మగుటనుగ్రహించి కొందఱు లేఖకులు “శ్శంకవీర” యనునక్షరములను జేర్చిరో చెప్పఁజాలము. ‘ని’ యను నక్షరము నర్థవంతముగాఁ జేయుట కే దేని మార్గమున్నదేమో చూడవలసియున్నది.

ఈకుమారరుద్రదేవునితండ్రి యెవ్వ రనువిషయము వివాదాస్పదము. బద్దెనకవి రచించిననీతిశాస్త్రముక్తావళి పీఠికలో శ్రీమానవల్లి రామకృష్ణకవిగారు ఓరుగంటి రుద్రదేవున కీతఁడుబంధువనియు, రుద్రదేవునకుఁ దరువాత నఱువదిసంవత్సరములలో నీతఁ డున్నఁవాడనియు వ్రాసియున్నారు. అట్లు వ్రాయుటకు వారి కేమియాధారములు కలవో యందుఁ దెలుపలేదు. శ్రీరామకృష్ణకవిగా రిట్లే యెందఱో పూర్వకవులనుగూర్చి యనేకవిషయములు పీఠికలలోను బత్రికలలోనువ్రాసియున్నారు, వ్రాయుచున్నారు. కానివారివ్రాఁతల కాధారము లేవియో తెలిపి తరువాతి పరిశోధకుల కవకాశములను గల్పించుచుండుట లేదు. ఇచ్చట రుద్ర దేవుఁ డనగా మొదటి ప్రతాపరుద్రదేవుఁడని యనుకొనవలయును. ఆతఁడు క్రీ. శ. ౧౧౫౦ మొదలు ౧౧౯౬ వఱకు రాజ్యము చేసినవాఁడు. ఆతని తుదిసంవత్సరమును దీసికొని లెక్కించినను, కుమారరుద్రదేవుఁడు の_9>悦の పాంతముననున్న వాఁడగుచున్నాఁడు. తిక్కనసోమయాజి నిర్వచ నోత్తర రావూయణమును రచింపకపూర్వమే Οοστοές డయోధ్యా కాండమును రచించెనని యిందువలనఁ దేలుచున్నది. అయోధ్యా కాండకృతిపతి యైన సాహిణిమారయ, ద్వితీయ ప్రతాపరుదుని కాలమువాఁడని చరిత్సకారులనుచున్నారు, ద్వితీయపతాపరుదుఁడు #). శ. ౧.9F> మొదలు ౧3_9= వఱకు రాజ్యము చేసినవాఁడు. రామకృష్ణకవిగారు చెప్పిన కాలముల్లో గుమారరుదజేవు డుండు సెడల, నాతఁడు సాహిణి వూరయ కయోధ్యాకాండమును గృతి యిచ్చుట యసంభవము. రామకృష్ణకవిగారి వాక్యములు బలవ 3