పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వు లై కా గ్లు న భ ట్రు 207 నియోగియని కొందఱును దలంచుచున్నారు. పై గద్యయందుఁ దన گی۔ పేరునకు భట్టశబ్దమును జే్చుటచే మల్లికార్జునుఁడు వైదిక బాహ2ణుఁ డని యూహింపఁదగియున్నది. నియోగియైనను, శ్రీనాథమహాకవి తనినామమునకు భట్ట శబ్లమును జేర్చియుండుటచే భట్ల శబ్లమును బట్టి ዒ2 Q EJ GO Qa వైదికులును బహుళముగా నుపయోగించుచుండుటచే, బలవత్తర మైన సౌక్యము లభించువజకు నీకవిని వైదికళాఖకుఁ జెందిన బాహ్మణుఁ ಜಿನಿಹೊ తలంపవలసియున్నది. హుళక్కి- భాస్క_రసఁడు నియోగి యని తలంచు నెడల, మల్లి కార్డున భట్ట నాతని కువూరుఁడని యనుట కి వకాశము లేదు, లేదా భట్టశబ్దము శ్రీనాథ భట్ట శబ్దము వంటిదని యోంచి మల్లికార్జనభట్టును గూడ నియోగి యని నిర్ణ యింప వలసియుండును. హుళక్కి- భాస్క-రుఁడును, మంతిభాస్క-రుఁడు నొక్కఁడే యనియు మల్లికార్డున భట్టాతని కుమారుఁ డనియుఁ గవిజీవితములలో గురజాడ శ్రీరామమూర్తిపంతులుగారు వాసియున్నారు. కానియది యంగీకరింపఁదగినదిగాదు. మంతిభాస్క-రునకు మల్లనయను కుమా రుఁ డున్న మాట సత్యమేకాని యాతఁడు కి వి యని చెప్పట కాధార ములు లేవు. ఆతనిని గేతనకవి తనదశకుమార చరితమున నీకింది పద్యములోఁ గీర్తించి యున్నాఁడు, అందాతనిని కవియని చెప్పియుం み露すe3. ఉ. బల్లిదుఁడే వృకోదరుఁడు భాగ్యసమగుఁడె కీన్నో శేశ్వసం డుల్లసిత పతాప గుణయు క్రుఁ డె పంకజ బాంధవుండు వా గ్వల్లభుఁడే 3❍ᎼoᏠᏱ సుభగత్వమనోజ్ఞడె మన్మథుండు మా మల్లన మంతి మంతి జనమండనుఁ బేర్కొని చెప్పి చెప్పచోన్. ఇందలి “వాగ్వల్లభుఁడే విరించి" యనుమూటలలో సీతఁడు విద్యలయందు బ్రహ్మయంతవాఁడని యున్నది. కావున సీతనిని గవి యని చెప్పటకు సంశయింప నక్క-ఆలేదని కొందఱందురు. ఇతరా