పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

162 వూn K న “... ... క్రీ. శ. ౧3.9.9–93 సంవత్సరములలో ఢిల్లీచక్ర వర్తియగు ఫుయాజద్దీన్ తుఫ్లూక్ అనుసుల్తాను ఒక మహాసైన్య మును తన జ్యేష్టపుత్రుఁ డగు ఉలూఫ్ఖానుని యాధిపత్యము క్రింద ఓరుగంటిని ముట్టడించుటకై పంపెను. ఉలూఫ్5ఖానుడు మొదట ప్రతాపరుద్రునిచేత పరాజితుడై పారిపోయినను అచిరకాలముననే మహాసైన్యముతో మరలివచ్చి యోరుగంటిని ముట్టడించెను. ఇత డింతత్వరలో మరలివచ్చునని ప్రతాపరుద్రచక్రవర్తి తలచియుండ àಜು. తత్పూర్వము తురకలయడావుడి వల్ల "దేశమంతయును నాశన మై పజాక్లో భకలిగి తిననాహారముకూడ లేక జనులు బాధపడు చుండిరి. వారి బాధను దొలగించుటకు చక్రవర్తి కోటలో నిలవచేసి యుంచిన ధాన్యము ; ఇతగ సామగులను నల్పకయమున కమ్మించి వారికిఁ గొంత తోడ్పడెను. మఱియు కోట సంరక్షణకై వచ్చియుండిన నాయకులనందరను తమతమ సైన్యములతో గూడ స్వస్థానములకుఁబంపి వేసి జేశమునందు వ్యవసాయము విరివిగా సాగించుటకు తగు నేర్పా టులు గావించెను. ఈ కారణమువల్ల ఉలూఫ్ ఖానుడు రెండన మూరు ఓరుగంటిని ముట్టడించినపుడు ముట్టడికినిలిచి, శత్రువిదా రణము కావించుటకు ప్రతాపరుద్రునికి శ_క్తి చాలక పోయెను. తత్కా-రణమున శీఘ్ర కాలముననే పతాపరుద్రచక్రవర్తి తురకలకు లొంగిపోయి దైవవశమున వారికి బందీగా చిక్కె-ను. ఉలూఫ్ఖానునికి ప్రతాపరుద్రుని తెలుగు దేశమున నిలువ నిచ్చుట కెంతమాత్రము నిష్టము లేకపోయెను. చక్రవర్తి పట్టబడ్డ విషయమును నాయకు లెరిగిన వెంటనే వారందరును మరలివచ్చి యూతనిని బందీవిము_క్తిని గావింపఁ బ్రయత్నింతురని ఉలూఫ్ఖాను డెరుగును. ఇదివరకాంధ్రుల కత్తిపోటును రెండు మూడు పర్యాయ ములు రుచిచూచిన వాడగుటచేత తానానాయకులతో పోరి నిర్వ హించుకొనగల నన్న నముక నూతనికి లేకపోయెను. తత్కా_రణ మున నతడు ప్రతాపరుద్రేుని శీఘ్రముగ తగు కావలిసైన్యమును తోడిచ్చి ఢిల్లీకి పంపివేసెను.