పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆంధ్ర కవి తరంగిణి

పద్యమునకు వూఱుగా వేఱొక పద్యముంటఁ జూచి యిది సర్వేశ్వర కృత మని గ్రహించి యాపద్యమును సూత్రమున కెక్కించి తాఁజేసి కొన్న నియమము ప్రకారముగా శతకమును బూర్తిచేసి కొంత కాల మునకుబిదప నాసత్ర శాలయంచే సిద్దినొందెను. ఆపద్యమిది:

మ. ఒకపువ్పుంబు భవత్పదద్వయముపై నొప్పంగ సద్భక్తి రo
జకుడై పెట్టిన పుణ్యమూర్తికింబునర్జన్మంబు లేదన్న బా
యక కాల తెరితయోపచారముల మ్నిన్నర్చించుచో బెద్దనై
స్టీకుడై యుండెదు వాడు నీవగుట దాజిత్రంబె సర్వేశ్వరా...

ఈయన్నమూనాధ్యుని కొడుకు వీరంరాజు. వీరంరాజు కుమారుడు నాగరాజు. నాగరాజు తనయుఁడు చిట్టెమరాజు. ఈయన పల్నాడు సీమకువచ్చి యచ్చట చెర్లగుడిపాడు, మిరియాల, పల్లిగుంత పశ్వేముల, వద్ది కేట, సీతానగరము నను నాఱు గ్రామములకుఁ కరణీకము సంపాదించెను. అప్పటినుండియు సీ వంశము వారు పల్నాటి సీమ వాసులైరి. చిట్టైమరాజు. కొడుకు గోపరాజు. గోపరాజు కొడుకు సోమ రాజు, -ఈ సోమరాజు సుప్రసిద్ధుడై యుండుటచే నాతని నాఁటి నుండియు నావంశమునకు యథావాక్కులవారను పేరు మాఱి సోమరాజువారను పేరు గలిగినది. ఇప్పటికి నిదియే వాడుకలో నున్నది.” ఇది సోమరాజు వేంకటశివుఁడుగారు వ్రాసినదానికి సంగ్ర హము. తాను బెద్దలవలన వినినదానిని వ్రాసినానని వేంకటశివుఁడు గారు వ్రాసినారు. ఈయన వ్రాసినదానినిబట్టి “యన్నమయ్యగారి వంశావళి" యను గ్రంథ మొకటియున్నట్లు కనంబడుచున్నది. దాని లోనివని వేంకటశివుఁడు గారు వ్రాసినపద్యములఁ గొన్నిఁటి నుదా హరించుచున్నాను. తప్పలు కుప్పలుగానున్నవి.

గీ.ధర యథావాక్కులాన్వయుత్వ విదులు వాఠిలో నొక్కసద్గుణుం డమితయశడు