పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(పది యువ సంపుట ము)

ఆంధ్ర కవి తరంగిణి

191 అయ్యలరాజు రామభద్రకవి

ఇతఁ డాఱు వేల) నియోగిబ్రాహ్మణు డు; ఆపస్థంబసూత్రు ఒంటిమిట్ట రఘువీర శతక మును రచియించిన ప్పయ మనీపికిఁ బ్ర పౌత్రుడు. పర్వత మంత్రికిఁ బౌత్రుఁడు అక్క-యామాత్యునకుఁ బుత్రుడు పారవస్తు ముమ్మడి వరదాచాగ్యుని శిష్యుఁడు, -ఈతఁడు రచించిన రామాభ్యుదయ గ్రంథాంత గద్య వలనఁబై విష యములు తెలియుచున్న . ఆ గద్యయిది.

“ శ్రీమదొంటిమిట్ట రఘువీర క్షత్రక నిర్మాణకర్మఠ జగదేక ఖ్యాతిధు ర్యాయ్యలు రాజతిప్పయ మనీషి, పర్వతాభిధానపౌత్రాక్క యామాత్యపుత్ర పరిశీలిత సమిర్త రామానుజవతసిద్ధాంతమర్మ ముమ్మ డి వరదాచార్య కటాక్షవీక్షా.పాత్ర హృదయపద్మాధిష్టిత శ్రీరామభద్ర రామభదకవి పక్షితంబైన రామాభ్యుదయంబను మహా ప్రబంధంబు"

ఈ గద్యతప్ప కవివృత్తాతం మును దెలుపు పద్య మొక్క-టియైనను రామాభ్యుదయమున లేదు. గద్యలో వ్రాసిన “తిప్పయమనీషి. పర్వ తాభిధానపౌత్ర" అను వాక్యమునకుఁ దిప్పయ మనీషికిఁ బర్వతయ్య సోదరుఁడనియు నతనికికవి పౌత్రుఁడనియు గొంత అర్థము చెప్ప చు న్నారు" ౧. అది కవిసంప్రదాయ విరుద్ధము సామాన్యముగా నిట్టి స్థలములలో రెండు పేరులను వరుసగా నుపయోగించినపుడు మొదటి


౧ శతక కవుల చరిత్రము