పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విజ్ఞా ప న ము

ఆంధ్రలోక పెుసంగిన పోత్సాహముచే బదియవ సంపుట మును బకటింపఁగలిగితిని. ఇందు బదునాఱవశతాబ్దియందలి యుత్త రార్ధమున నున్నకవుల చారిత్రములున్నవి. ఈ కాలమునందలి కవులిం కను గొందఱు కలరు. వారు పదునొకండవ సంపుటమున వచ్చెదరు. ఈపది సంపుటములలోను గల కవుల నామముల నకారాది యక్షర క్రమమునఁ జూపుపట్టిక నీసంపుటాలితమునఁ జేర్చితిని నేననుకొనినంత శీఘ్రముగఁ బని జరుగకపోవుటకుఁ గారణము ద్రవ్యాభావమే. ఇతోధికముగ సాహాయ్య మొసంగి నా యుద్యమమును గొన సాగింపుఁడని యాంధ్రుల మరివురి వేఁడుకొనుచున్నాఁడను.
ఇట్లు:
గ్రంధ కర్త
విజయ సంవత్సర
శ్రావణపూర్ణిమ