పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామచంద్ర

ఆంధ్రకవితరంగిణి

40 రంగనాథుడు

రంగనాధ రామాయణ మనుపేర బరగు ద్విపదకావ్యమాంధ్రదేశమున, విశేషించి పశ్చిమాంధ్రమున్ నధికప్రచారములోనున్నది. భాస్కరరామాయణ చారిత్రమువలెనే, రంగనాధరామాయణచారిత్రమును వివాదాస్పదము. ఉత్తరకాండముతోగూడ మొత్తమీ రామాయణమును రంగనాధుడను కవి రచియించెనని చిరకాలానుగతమైన జనశ్రుతికలదు. కాని గ్రంధమునం దెచ్చటను నీతని పేరు కానిపించదు. పూర్వరామాయణ మనుపేర మొదటి యాఱుకాండములను గోసబుద్ధభూపతి రచియించి, తనతండ్రియైన విట్టలభూపతికి గృతియిచ్చినట్లును ఉత్తరరామాయణమును బుద్ధభూపతికుమారులైన కాచరాజు, సకలరాజులురచియించి, బుద్ధబూపతికిగృతియిచ్చింట్లును నాగ్రంధమునందెచ్చటను, రంగనాధరామాయణ మనుపేరు లేదు. ఉత్తరరామాయణ కర్తలుకూడ మొదటియాఱుకాండములను బూర్వరామాయణమనియే యనిది. కాని గందనాధరామాయణ మనలేదు. శీర్షికయందును ముఖపత్రము మీదనుమాత్రమే యీపేరుకానవచ్చుచున్నది.

ఈగ్రంధకర్తృత్వవిషయమున బండితులలో భిన్నాభిప్రాయములుండుటచే వాదోపవాదములు పెక్కుజరిగినవి. వారివాదపాదసారాంశము లివి.

1 రంగనాధుడు, కల్పిపురుషుడు, రంగనాధరామాయణనామములోని రంగనాధసబ్దమునుబట్టి జనించిన భ్రాంతిమూలమున