పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రo గ నా ధుఁ డు

యమునుగూర్చి హుళక్కి-భాస్కర కుమారరుద్ర దేవుల చారిత్రముల యందు విపులముగాఁ జర్చించియున్నాఁడను. భాస్క_ర రావూయణ మునకం"ట రంగనాథ రావూయణము మిన్నగా నుండెనని తెలుపుట కీకథ యొక్కింత యుపకరించిన నుపకరించునుగాని రంగనాథ రావూ యణ క_ర్తృత్వ వివాదమును బరిష్కరించుట కిది యించు కేనియు నుపయోగింపదు. "కావున దీనిని ద్యజించి వేయుదము.

ఇఁక నిత రాధారములను బట్టి వివాద విషయములను గూర్చి యాలోచింప వలసియున్నది.

రం గ నా ధుఁ డు కి ల్పి త పు రు పుఁ డా! 

ఈద్విపద రామాయణమునకు "రంగనాథ రావూయణ” మును పేరు కవియుంచిన దని చెప్పట కాధారములు లేవు. ఈ పేరును గవి యుంచినచో, గంథమునం దెచ్చటనో నొకచోటఁ జెప్పియే యుం డును. ఉ_త్తర రావూయణమునఁ గూడఁ గవి పూర్వరామాయణ వునియే చెప్పెను గాని రంగనాథ రామాయణ మున లేదు. ఇతర రావూ యణములతో భిన్నత్వమును దెలుపుటకై తరువాతి కవులు, పండి తులు, పాఠకులు నిట్టి పేరులను బెట్టి వాడుచుండుట లోకాచారము. కుమ్మర మొల్ల రచించిన రావూయణమును “మైుల్లరామాయణ”మని వాడుచున్నాము. ఆ పేరును కవయిత్రి యుంచ లేదు. గ్రంథమున మొల్ల రామాయణ మని లేదు. కానిముద్రిత ప్రతులలో శీర్షికలయందు మొల్ల రావూయణ మనిముద్రిత వుగుచున్నది. “ఎఱ్ఱాప్రగడ రామాయణ"మని యణ” మనీ, ' వావిలికొలను రావూయణ"మని, జనమంచి రామాయణ" వుని ప్రజలలో వాడుకలు బయలుదేరినవి. ఆట్లే యీ రామాయణమును రంగనాథ రావూయణ మను పేరc గొంత-కాలమునకుఁ దరువాత కవులో, పండితులో, వాడుటకు యారంభించిరనియు, నది క్రమక్రమముగా స్థిరమై పోయెననియుఁ దలంచుట సమంజసము. ఇట్టి సందర్భములలో గ్రంధమునకుఁ గవి పేరును జేర్పి వాడుచుందు రని